
రోడ్డుపై బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. భద్రతా కారణాల దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ కొంతమంది హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని భావించి దానిని ధరించడానికి వెనుకాడుతుంటారు. కొంతమంది అసలు పూర్తిగా హెల్మెట్ ధరించడమే మానేస్తారు. కానీ హెల్మెట్ నిజంగా జుట్టు రాలడానికి కారణమవుతుందా? దీని వెనుక అసలు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని చాలా మంది భావిస్తారు. చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అంకుర్ సరిన్ ఏం చెబుతున్నారంటే.. హెల్మెట్లు నేరుగా జుట్టు రాలడానికి కారణం కావు. కానీ మురికిగా లేదా బిగుతుగా ఉండే హెల్మెట్ వల్ల చుండ్రు పెరగడం, జుట్టుపై ఒత్తిడి పెరగడం ద్వారా జుట్టు దెబ్బతింటుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. అలాగే బిగుతుగా ఉండే హెల్మెట్ ధరించడం వల్ల నెత్తిమీద ఎక్కువ చెమట ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. కాబట్టి, సరైన హెల్మెట్‌ను ఎంచుకుని, తరచూ దానిని శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
మురికి హెల్మెట్ చెమట, బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. ఇది నెత్తిమీద చుండ్రు పెరగడానికి దారితీస్తుంది. చుండ్రు నెత్తిమీద చికాకు కలిగిస్తుంది. జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. కాబట్టి హెల్మెట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం, హెల్మెట్ ధరించే ముందు మీ తల చుట్టూ స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.
టైట్ గా ఉన్న హెల్మెట్ ధరించడం వల్ల తలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. జుట్టు రాలడానికి దారితీస్తుంది. సరైన పరిమాణంలో సౌకర్యవంతంగా ఉండే హెల్మెట్‌ను ఎల్లప్పుడూ ధరించడం ముఖ్యం.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.