Corona Spread Through Fingernails : మహిళలు సాధారణంగా పొడవాటి, స్టైలిష్ గోర్లు కలిగి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వాటిని శుభ్రంగా ఉంచగలరా..? ఇది విరేచనాలు, ఇతర ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన బాక్టీరియా వ్యాధులకు కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పొడవాటి గోర్లు ఎక్కువ ధూళిని కలిగి ఉంటాయి. ఇది చాలా ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం కావచ్చు. డాక్టర్ పాండ్యా ప్రకారం.. “గోర్లు చిన్నగా ఉంచాలి పదేపదే శుభ్రం చేయాలి. చేతులను శుభ్రపరిచే ప్రక్రియను సరిగ్గా పాటించకపోతే అది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది.”
చాలా మందికి తమ చేతులను ముఖ్యంగా గోళ్లను శుభ్రంగా, ధూళి లేకుండా ఎలా ఉంచుకోవాలో తెలియదు. అందువల్ల ఇది చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. డాక్టర్ పాండ్యా మాట్లాడుతూ.. “చేతి పరిశుభ్రత నిర్లక్ష్యం వల్ల అనేక వ్యాధులు, బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటిలో దేశవ్యాప్తంగా వినాశనం కలిగించే ఘోరమైన COVID-19 వైరస్ కూడా ఉంది. గోళ్ళలో చాలా ధూళి, శిధిలాలు ఉండవచ్చని COVID-19 వ్యాప్తి చెందడానికి మొదటి కారణంగా ఉంటుందని చెప్పింది. మన చేతులను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల జెర్మ్స్ చేరి వాటివల్ల అనారోగ్యానికి గురవుతారు. మీ చేతులను బాగా శుభ్రం చేసుకొని తినండి తద్వారా ఆరోగ్యంగా ఉంటారని” వివరించింది.
గోర్లు శుభ్రపరిచే చిట్కాలు..
1. మీ చేతులను గోళ్ళతో సహా వాటి కింద, గోరువెచ్చని నీరు, సబ్బుతో అవసరమైనంత తరచుగా కడగాలి.
2. మీరు గ్రీజు వంటి ధూళి మధ్య పనిచేస్తే అప్పుడు మీరు పని చేసేటప్పుడు ఒక జత చేతి తొడుగులు ఉపయోగించాలి. లేదా మీరు ఆ రకమైన ధూళికి ప్రత్యేక క్లీనర్‌ను కూడా వాడవచ్చు.
3. క్రమం తప్పకుండా గోర్లు కట్ చేయడం వల్ల ఆరోగ్యకరమైన గోర్లు నిర్వహించడానికి, వాటి విచ్ఛిన్నతను నివారించడానికి సహాయపడుతుంది.
4. మీరు చేతులు కడుక్కున్న ప్రతిసారీ వాటిని పూర్తిగా ఆరబెట్టాలి.
5. తేమతో కూడిన చేతులు వృద్ధి చెందుతున్న సూక్ష్మక్రిములను ఆకర్షించగలవు.
6. గోర్లు కత్తిరించే ముందు, కట్టర్లను సరిగ్గా శుభ్రం చేయండి.