నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గుతుందా..? అస్సలు నమ్మలేరు తెలుసా..

|

Dec 03, 2024 | 10:04 AM

హార్వర్డ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తగినంత నీరు త్రాగటం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు నీరు త్రాగడం వల్ల మీరు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.. దీని ద్వారా అతిగా తినడం నిరోధిస్తుంది. నీరు జీవక్రియను పెంచుతుంది.. కేలరీల బర్నింగ్‌ను వేగవంతం చేస్తుంది.

నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గుతుందా..? అస్సలు నమ్మలేరు తెలుసా..
Weight Loss Tips
Follow us on

బిజీ లైఫ్, అనారోగ్యకరమైన ఆహారం, తీవ్రమైన ఒత్తిడి.. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న బరువు, ఊబకాయం నేడు చాలా మందికి తలనొప్పిగా మారింది. దీని కారణంగా, వారు తమను తాము ఫిట్‌గా, ఫైన్‌గా ఉంచుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కొందరు జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేస్తే మరికొందరు ఇంట్లోనే బరువు తగ్గడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏవేవో డైట్లను అనుసరిస్తున్నారు.. అలాంటి వాటిలో ఒకటి తాగునీరు… నీరు త్రాగడం వల్ల బరువు తగ్గుతుందని, ఫ్యాట్ తగ్గుందని చాలా మంది విశ్వసిస్తారు.. నిజంగా నీళ్లు తాగితే బరువు తగ్గుతారా.? దీని గురించి హార్వర్డ్ నిపుణులు ఏమంటున్నారు..? ఇప్పుడు తెలుసుకోండి..

హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. నీరు తాగడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. త్వరలోనే దీని ప్రభావం కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు.. కానీ బరువు తగ్గాలంటే నీరు త్రాగే సమయాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. మీరు తినడానికి కనీసం అరగంట ముందు నీరు త్రాగాలి.. రోజంతా చిన్న మొత్తంలో నీరు త్రాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.. ఒకేసారి తాగే బదులు రోజంతా కొంచెం కొంచెం నీరు తాగడం చాలా మంచిది.

భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండుతుంది.. ఇది అతిగా తినకుండా చేస్తుంది. చాలా సార్లు ప్రజలు అధిక దాహాన్ని ఆకలిగా భావించి ఎక్కువ తింటారు. అటువంటి పరిస్థితిలో, త్రాగునీరు అతిగా తినడం నిరోధిస్తుంది.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

శరీరంలో సరైన మోతాదులో నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది.. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. నీరు త్రాగడం ద్వారా బర్న్ చేయబడిన కేలరీల శాతం.. దాదాపు 30 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

బరువు తగ్గడానికి, శరీర కొవ్వును కరిగించడం అవసరం.. శరీరానికి తగినంత నీటిని అందించడం ద్వారా, కొవ్వును వేగంగా బర్న్ చేయడం సులభం అవుతుంది. నిజానికి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కణాల్లోని కొవ్వును కరిగించి శక్తిగా మార్చడం వల్ల బరువు తగ్గుతుంది.

నీటిని పుష్కలంగా దాగడం ద్వారా.. బరువు తగ్గడంతోపాటు శరీరంలో డీహైడ్రేషన్ సమస్య రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..