Food: నెల రోజులపాటు నాన్‌ వెజ్‌ మానేస్తే, ఏమవుతుందో తెలుసా.?

|

Aug 26, 2024 | 11:16 AM

మాంసాహారాన్ని వారంలో ఒకటి, రెండుసార్లు తీసుకుంటే పర్లేదు కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్‌ వెజ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కాలక్రమేణ గుండెపోటు వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు...

Food: నెల రోజులపాటు నాన్‌ వెజ్‌ మానేస్తే, ఏమవుతుందో తెలుసా.?
Eating Non Veg
Follow us on

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. అలాగే ఆహారం ఏమాత్రం తేడాలు వచ్చినా వెంటనే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇక మనలో చాలా మంది నాన్‌ వెజ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఆ మాటకొస్తే కొంత మందికి నాన్‌ వెజ్‌ లేకపోతే ఏదో లోటుగా ఫీలవుతుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా నాన్‌ వెజ్‌ ఉండాల్సిందే. అయితే మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంతమేర ప్రయోజం ఉంటుందనడంలో నిజం ఉన్నట్లు కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి.

మాంసాహారాన్ని వారంలో ఒకటి, రెండుసార్లు తీసుకుంటే పర్లేదు కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్‌ వెజ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కాలక్రమేణ గుండెపోటు వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక నెల రోజుల పాటు శరీరంలో జరిగే మార్పులను గమనిస్తే కచ్చితంగా నాన్‌ వెజ్‌ను తగ్గిస్తారని సూచిస్తున్నారు. ఇంతకీ నాన్‌ వెజ్‌ను తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* నాన్‌వెజ్‌ తీసుకోవడాన్ని తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

* నెల రోజుల పాటు నాన్‌ వెజ్‌ను తీసుకోకపోతే శరీర బరువు తగ్గడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. ఇందులోని తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

* ఒక నెల రోజుల పాటు నాన్‌ వెజ్‌ను తీసుకోవడాన్ని ఆపేస్తే.. మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఆకు కూరల్లో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇది ప్రేగుల కదలికను కూడా నిర్వహిస్తుంది మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

* నాన్‌వెజ్‌లో సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడానికి కారణమవుతుంది. ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి వస్తుంది. వెజ్‌ తీసుకోడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ గణనీయంగా తగ్గుముఖం పడుతాయి.

* ఇక నెల రోజుల పాటు నాన్‌ వెజ్‌ను పూర్తిగా మానేసి.. కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిని పెంచుతాయి. నీరసం తగ్గుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..