Diarrhea Relief Tips: డయేరియాకు చెక్ పెట్టాలా.. అయితే ఈ ఫుడ్స్ బెస్ట్!

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం చలిగా ఉన్నా.. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ విపరీతంగా ఉంటుంది. దీంతో రోజు వారీ కూలి పనులు చేసుకునే వారు అల్లాడి పోతున్నారు. ముందు ముందు ఈ ఎండ తీవ్రతలు రెట్టింపు కానున్నాయి. ఇలా వాతావరణం మారినప్పుడే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అవి తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉంటే.. ఎలాంటి సమస్యలు రావు. కానీ ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉంటే..

Diarrhea Relief Tips: డయేరియాకు చెక్ పెట్టాలా.. అయితే ఈ ఫుడ్స్ బెస్ట్!
Diarrhea

Updated on: Feb 12, 2024 | 2:43 PM

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం చలిగా ఉన్నా.. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ విపరీతంగా ఉంటుంది. దీంతో రోజు వారీ కూలి పనులు చేసుకునే వారు అల్లాడి పోతున్నారు. ముందు ముందు ఈ ఎండ తీవ్రతలు రెట్టింపు కానున్నాయి. ఇలా వాతావరణం మారినప్పుడే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అవి తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉంటే.. ఎలాంటి సమస్యలు రావు. కానీ ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉంటే మాత్రం పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమయంలోనే చాలా మందికి డయేరియా రావొచ్చు.

డయేరియా అంటే కంట్రోల్ లేకుండా మోషన్స్ ఎక్కువగా అవడం. మోషన్స్ కారణంగా శరీరం నీరస పడిపోతుంది. ఇంకొంత మందిలో కడుపులో నొప్పి, వాంతులు కూడా అవతాయి. అయితే ఇలా మోషన్స్ విపరీతంగా అయినప్పుడు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. మోషన్స్ ఎక్కువగా అవడం వల్ల శరీరం నుంచి నీటి మొత్తం అనేది బయటకు వెళ్తుంది. దీని వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తేలిక పాటి.. నీటి శాతం ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగు:

మోషన్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు మజ్జిగ లేదా పెరుగు వంటివి తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవడమే కాకుండా.. నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి. ఇవి మోషన్స్‌ను ఈజీగా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఓట్స్:

మోషన్స్ అవుతున్నప్పుడు ఓట్స్‌ తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి.. దీని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మోషన్స్ కంట్రోల్ చేయడంలో ఓల్స్ బాగా హెల్ప్ చేస్తాయి.

సాల్ట్ వాటర్:

మోషన్స్ అవుతున్నప్పుడు శరీరం బాగా నీరసించి పోతుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఇలాంటి సమయాల్లో తిరిగి శక్తి పొందాలంటే సాల్ట్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. అవసరం అయితే ఇందులో నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు.  పంచదార లేదా పటిక బెల్లం అయినా కలుపుకుని తాగవచ్చు. దీని వల్ల శరీరానికి శక్తి లభించడమే కాకుండా.. నీరసం తగ్గుతుంది.

మునగాకు జ్యూస్:

లూజ్ మోషన్స్ అయ్యేవారు మునగాకు జ్యూస్ తాగడం వల్ల కూడా మంచి ఉపశమనం లబిస్తుంది. మునగాకు జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అంతే కాకుండా బాడీకి శక్తి కూడా అందుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.