వేసవిలో చల్లటి కోలా తాగాలని ఉందా.. అయితే మీ మొఖంపై మొటిమలు రావడం ఖాయం…

| Edited By: Ravi Kiran

Jun 09, 2023 | 10:00 AM

వేసవి కాలంలో చల్లటి కోలా పానీయాలను తాగేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వివిధ కంపెనీలకు చెందిన కోలా డ్రింక్స్ ను తాగేందుకు జనం ఇష్టపడతారు.

వేసవిలో చల్లటి కోలా తాగాలని ఉందా.. అయితే మీ మొఖంపై మొటిమలు రావడం ఖాయం...
Beverages
Follow us on

వేసవి కాలంలో చల్లటి కోలా పానీయాలను తాగేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వివిధ కంపెనీలకు చెందిన కోలా డ్రింక్స్ ను తాగేందుకు జనం ఇష్టపడతారు. అయితే ఈ కోలా ఉత్పత్తులు ఆరోగ్యానికి అంత మంచివి కాదని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు నిజానికి కోలా ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎప్పటినుంచో వైద్యులు చెబుతూనే ఉన్నారు అయితే కోలా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు సైతం వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

>> కోలా ఉత్పత్తుల్లో అత్యధిక శాతం చక్కర ఉంటుంది. పానీయం రుచి కోసం చక్కెరను అత్యధికంగా కలుపుతారు. అత్యధిక మొత్తంలో పంచదారను శరీరంలోకి తీసుకోవడం ద్వారా మీ కాలేయము క్లోమంపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. అంతేకాదు ఇది మీ చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుంది. కోలా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే మీ చర్మం డల్ గాను కాంతి విహినం గాను మారే అవకాశం ఉంది.

>> కోలా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో డిహైడ్రేషన్ కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యధిక శాతం లో చక్కెర, కెఫీన్ మన శరీరంలో చేరినప్పుడు శరీరం డిహైడ్రేట్ అవుతుంది అప్పుడు మన చర్మం కూడా నిర్జలీకరణ జరిగి కాంతి విహీనంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

>> అంతేకాదు కోలా ఉత్పత్తులను అధిక మొత్తంలో తీసుకున్నట్లయితే శరీరంలో హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫలితంగా మొటిమలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖం పైన అదేవిధంగా శరీర భాగాల్లో మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కోలా ఉత్పత్తుల్లో వాడే కొన్ని పదార్థాలు రక్తంలో ఇన్ఫెక్షన్ కలిగేలా చేస్తుంటాయి ఫలితంగా, కోలా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకున్నప్పుడు చర్మ గ్రంధులు మూసుకుపోయే అవకాశం ఉంది ఫలితంగా చర్మంపై మొటిమలు, డెడ్ స్కిన్, బ్లాక్ స్పాట్స్ ఏర్పడే అవకాశం ఉంది.

మరి కోలా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఏమి తీసుకోవాలి:

– వేసవిలో మీరు పానీయాలను తీసుకోవాలి అనుకుంటే ముందుగా కనిపించే ఛాయిస్ కొబ్బరినీళ్లు అని చెప్పవచ్చు. కొబ్బరినీళ్లు వేసవికాలంలో దివ్యామృతంగా పనిచేస్తాయి శరీరం కోల్పోయినటువంటి మినరల్స్ మీరు అదే విధంగా సహజ లవణాలను భర్తీ చేసేందుకు కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. అంతేకాదు కొబ్బరినీళ్ళను తీసుకోవడం ద్వారా శరీరం .హైడ్రేట్ అవుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

– మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా వేసవికాలంలో చక్కటి హైడ్రేషన్ పొందే అవకాశం ఉంది. వేసవిలో చర్మం చమట రూపంలో అత్యంత ముఖ్యమైన లవణాలను కోల్పోతుంది. వాటిని భర్తీ చేసేందుకు మజ్జిగ చక్కటి ప్రత్యామ్నాయం అనే చెప్పాలి. ఎండలో వెళ్లే ముందు మజ్జిగను తీసుకొని వెళ్తే వడదెబ్బ తగలదు.

-బార్లీ నీళ్లు తీసుకోవడం ద్వారా కూడా శరీరం హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా మీ చర్మం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది. బార్లీ గింజలను నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఉడకబెట్టి అందులో నిమ్మకాయ పంచదార కలుపుకొని తాగడం ద్వారా శరీరానికి చలవ చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..