Garlic Peel: వెల్లుల్లి తొక్కలు పడేస్తున్నారా? ఆగండాగండీ.. ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

చాలా మంది రోజూ వెల్లుల్లిని వంటకాల్లో వాడతారు. అయితే దాని తొక్కలను మాత్రం వృద్ధాగా పడేస్తుంటారు. ఎందుకంటే దాని ఉపయోగం గురించి తెలిస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయరు. వెల్లుల్లి తొక్కలను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వెల్లుల్లి తొక్కను ఎలా ఉపయోగించాలి? దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Garlic Peel: వెల్లుల్లి తొక్కలు పడేస్తున్నారా? ఆగండాగండీ.. ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..
Garlic Peel

Updated on: Apr 29, 2025 | 8:42 PM

వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే . కానీ దాని తొక్కలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అవును… చాలా మంది రోజూ వెల్లుల్లిని వాడతారు. అయితే దాని తొక్కలను మాత్రం వృద్ధాగా పడేస్తుంటారు. ఎందుకంటే దాని ఉపయోగం గురించి తెలిస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయరు. వెల్లుల్లి తొక్కలను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వెల్లుల్లి తొక్కను ఎలా ఉపయోగించాలి? దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

వెల్లుల్లి తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉంటే వెల్లుల్లి తొక్కలతో చిటికెలో తరిమేయొచ్చు. ఇందుకు వెల్లుల్లి తొక్కలను నీటిలో బాగా మరిగించి, ఆ నీరు చల్లబడిన తర్వాత ఒక సీసాలో నిల్వ చేయాలి. దీనిని సాయంత్రం ఇంటి చుట్టూ పిచికారీ చేయాలి. ఇలా చేయడం ద్వారా దోమల బెడద నుంచి బయటపడవచ్చు. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా మీ ఆరోగ్యం దెబ్బతినదు. అలాగే మీ ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉంటే ఏ ఇంటి నివారణలు ప్రయత్నించినా అది తగ్గకపోతే.. వెల్లుల్లి తొక్కను వినియోగించడంది. ఇందుకు వెల్లుల్లి తొక్కలను నానబెట్టి, మరిగించి, ఆ నీటితో ముఖాన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత అదే నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్యలు తగ్గుతాయి.

చుండ్రు, జుట్టు రాలడం వల్ల బాధపడుతుంటే.. వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి, ఆ నీటిని జుట్టుకు వినియోగించండి. తర్వాత ఆ నీటితో తలను బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం ఒకటి నుంచి మూడు సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా పెరుగుతుంది. అలాగే మీరు వెల్లుల్లి తొక్కలను కంపోస్ట్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని మొక్కలకు వేయడం వల్ల అవి బాగా పెరుగుతాయి. కీటకాలను నివారిస్తాయి. వెల్లుల్లిని రోజూ తినడంతో పాటు, దాని తొక్కలను పారవేయకుండా ఈ విధంగా ఉపయోగించవచ్చు. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని సులభమైన ఇంటి నివారణ పద్దతి. అంతేకాకుండా ఎవరైనా దీన్ని సులువుగా ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్న ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.