Sweet Mangoes : మీరు నిజంగా పండిన మామిడి పండ్లనే తింటున్నారా..! సరైన పండ్లను ఎంపిక చేసుకోవడానికి ఈ నాలుగు పద్దతులను తెలుసుకోండి..

|

Jun 12, 2021 | 10:30 PM

Sweet Mangoes : వేసవి రోజులలో లభించే తియ్యనైన మామిడి పండ్లను తినడాన్ని ఎవ్వరు ఇష్టపడరు చెప్పండి. కానీ

Sweet Mangoes : మీరు నిజంగా పండిన మామిడి పండ్లనే తింటున్నారా..! సరైన పండ్లను ఎంపిక చేసుకోవడానికి ఈ నాలుగు పద్దతులను తెలుసుకోండి..
Sweet Mangoes
Follow us on

Sweet Mangoes : వేసవి రోజులలో లభించే తియ్యనైన మామిడి పండ్లను తినడాన్ని ఎవ్వరు ఇష్టపడరు చెప్పండి. కానీ మీరు సహజసిద్దంగా పండిన మామిడి పండ్లనే తింటున్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అన్ని మామిడి పండ్లు పసుపు పచ్చగానే కనిపిస్తాయి. కానీ అందులో న్యాచురల్‌గా పండినవి ఎన్ని కృత్రిమంగా పండినవి ఎన్ని అనేది మాత్రం తెలియదు. చాలామంది ఇలాగే గందరగోళానికి గురై కృత్రిమంగా పండిన పండ్లను తీసుకెళ్తారు. తద్వారా రోగాలను కొని తెచ్చుకుంటారు. అందుకే మామిడి పండ్లను తీసుకునేటప్పుడు ఈ నాలుగు పద్దతులను కచ్చితంగా పాటించండి. అప్పుడే మీరు సరైన పండ్లను తీసుకోగలుగుతారు.

1. దాన్ని తాకి అనుభూతి పొందండి..
పండిన మామిడి మృదువుగా ఉంటుంది. చక్కని ఆకృతిని కలిగి ఉంటుంది. మీద పచ్చగా ఉండి ఒత్తినప్పుడు గట్టిగా ఉంటే కృత్రిమ పండ్లని అర్థంచేసుకోవాలి. అవి చూడటానికి పండిన మాదిరిగానే కనిపిస్తాయి. కానీ లోపల గట్టిగా ఉంటుంది.

2.మామిడి రంగును తనిఖీ చేయండి..
రంగు ఆదర్శంగా ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలి. అయితే ఇవన్నీ మీరు ఎంచుకున్న మామిడి రకాన్ని బట్టి ఉంటాయి. ఏ పండైనా సరే మృదువుగా అనిపించాలి రంగు ప్రకాశవంతంగా ఉండాలి.

3. మామిడి వాసన
మామిడి వాసన, తీపి, సుగంధ, ఫల వాసన ఉంటే అవి పండినవి. పండిన మామిడి ఎప్పుడూ మంచి తీపి వాసన వస్తుంది.

4. మామిడి పరిమాణం
మామిడి మందపాటి గుండ్రని ఆకారంలో ఉండాలి. చదునైన లేదా సన్నని ఆకృతిని కలిగి ఉన్న మామిడి పండ్లను ఎంచుకోవద్దు.

JIO New Plans: కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో.. వీటితో డేటా వినియోగానికి నో లిమిట్‌..

Shooting in The Town of Austin : టెక్సాస్‌లోని ఆస్టిన్ పట్టణంలో కాల్పులు.. 13 మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Vidya Balan: ఐ డోంట్ కేర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. ట్రోల్స్ ను పట్టించుకోనంటున్న ముద్దుగుమ్మ