
Green Chillies : భారతీయ వంటకాలలో పచ్చిమిర్చిని అనాధిగా వాడుతున్నారు. వంటలలో దీనికో ప్రత్యేకత ఉంటుంది. కూరలలో పచ్చిమిర్చి వేస్తే హాట్‌గా ఉండటమే కాకుండా చక్కని రుచిని అందిస్తుంది. ముఖ్యంగా మసాల వంటకాలలో ఇది లేనిదే పని జరగదు. స్పైసీ కావాలంటే కచ్చితంగా పచ్చిమిర్చి పడాల్సిందే.. అయితే రుచి కోసమే కాదు పచ్చిమిర్చి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలామంది కేవలం స్పైసీ కోసం మాత్రమే పచ్చిమిర్చి వాడుతారు అనుకుంటారు కానీ ఇందులో అద్భుత ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. ప్రజలు దీనిని చాలా విధాలుగా ఇష్టపడుతారు. కొందరు పచ్చిగా ఇష్టపడితే మరికొందరు వేయించుకొని తింటారు. పచ్చి మిరపకాయలు ఆహారంలో మసాలాలు జోడించడం పాటుగా మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి మిరపకాయలు కొవ్వును తగ్గిస్తాయి. క్యాలరీలు కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2. భోజనం చేసిన మూడు గంటల వరకు 50 శాతం వరకు జీవక్రియను పెంచవచ్చు.
3. ఇది ఏథరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.
4. ఇది మీ మూడ్ ను వెంటనే మార్చుతుంది. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. మీరు మరింత శక్తిగా చురుకుగా అనుభూతి చెందుతారు.