Lifestyle: విస్కీ, బీర్‌ రెండూ కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

| Edited By: Shaik Madar Saheb

Oct 12, 2024 | 8:15 AM

వైన్‌, బీర్‌ ఇలా రెండింటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. రెండు వేరు వేరు స్వభావాలు కలిగిన డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. రెండింటిని కలిపి...

Lifestyle: విస్కీ, బీర్‌ రెండూ కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
Whisky And Beer
Follow us on

ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్కహాల్ సేవించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటుంటారు. అయితే మద్యం ప్రియులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. వైన్‌, విస్కీ, బీర్‌ అని అనే తేడా లేకుండా తెగ లాగించేస్తుంటారు. అయితే బీర్‌లో విస్కీ లేదా వైన్‌ కలుపుకొని తాగితే ఏమవుతుంతో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ బీర్‌లో వైన్‌ కలుపుకొని తాగితే ఏమవుతుంతో ఇప్పుడు తెలుసుకుందాం.

వైన్‌, బీర్‌ ఇలా రెండింటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. రెండు వేరు వేరు స్వభావాలు కలిగిన డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. రెండింటిని కలిపి తీసుకుంటే మనిషి త్వరగా మత్తులోకి జారుకుంటారని అంటున్నారు.

చివరికి ఆలోచించే విచక్షణను సైతం కోల్పోతారు. ఇక బీర్‌, వైన్‌ లేదా విస్కీ కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రుళ్లు తాగి పడుకుంటే ఉదయంసరికి శరీరంలో ఎన్నో ఇబ్బందులకు దారి తీస్తుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ కారణంగా మెదడుపనితీరుపై ప్రభావం పడుతుంది. శరీరంలోకి ఆల్కహాల్‌ ప్రవేశించిన వెంటనే శరీరంలో ఉన్న నీటిని బయటకు పంపిచేస్తుంది.

విస్కీ, బీర్‌ కలిపి తీసుకుంటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది దారి తీస్తుంది అంటున్నారు. ఇక ఈ కారణంగా ఛాతీలో మంట ఎక్కువుతుందని అంటున్నారు. కడుపులో, ఛాతి మంటకు ఇది దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల పనితీరుపై కూడా బీర్‌, విస్కీ కలిపితీసుకోవడం తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..