ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలతో అనంత్ అంబానీ బాగా హైలెట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వీడియోస్ వైరల్‌గా మారాయి. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ వేడుక హైలెట్‌గా మారింది. అయితే ఈ వెడ్డింగ్‌లో అనంత్ అంబానీ గురించే పెద్ద చర్చ నడిచింది. ఆయన ఏం తింటారు? ఎందుకు బరువు తగ్గడం లేదని.. చాలా డౌట్స్ జనాల్లో వచ్చాయి. అనంత్ అంబానీ 2016లో ఏకంగా ఆయన 108 కేజీల బరువు తగ్గారు. ఆయన్ని చూసి అప్పట్లో అంతా షాక్ అయ్యారు. కానీ ఆయనకున్న అనారోగ్య సమస్య వల్ల స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. దీంతో మళ్లీ బరువు పెరిగారు. ఇంతకు ముందు అనంత్ అంబానీ ఏకంగా 200 కిలోల బరువు ఉండేవారు. అయితే అనంత్ అంబానీ ఏం తింటున్నారు? ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారని తెలుసుకునేందకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఫిట్ నెస్ కోచ్, సెలబ్రిటీ ట్రైనర్ అయిన వినోద్ చన్నా.. అనంత్ అంబానీకి ఫిట్ నెస్ ట్రైనింగ్ అందిస్తున్నారు. అనంత్ బరువు తగ్గేందుకు చాలా సహకరిస్తున్నారు. అనంత్ తినాల్సి డైట్‌ని ముందుగానే నిర్ణయిస్తున్నారు. అలాగే ఎంత సేపు వ్యాయామం చేయాలి? ఎంత సేపు నిద్ర పోవాలి? అన్న వివరాలు కూడా వినోద్ నిర్ణయించేవారట. ఇంతకు ముందు వినోద్ చన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ డైట్ ఏంటో చెప్పారు.
అనంత్ అంబానీకి ప్రతి రోజూ 1000 క్యాలరీల నుంచి 1400 క్యాలరీల మధ్యన ఆహారాన్ని అందిస్తారు. అందులో కాటేజ్ చీజ్, నెయ్యి, పప్పు దినుసులు, మొలకలు, కూరగాయలు ఉంటాయి. కాగా అనంత్ అంబానీకి అతిగా తినే అలవాటు ఉంది. ఆయన ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవారట. అది మానిపించి.. ఇప్పుడు ఈ డైట్ ఫాలో చేస్తున్నారు వినోద్ చన్నా. అలాగే అనంత అంబానీ డైట్‌లో ఫైబర్, ప్రోటీన్ వంటివి కూడా ఉండేలా చనూస్తున్నారు.
అలాగే ఒకే సారి తినకుండా.. తినే ఫుడ్‌ని సైతం డివైడ్ చేసి అందిస్తున్నారు. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా తగినం నిద్ర వల్ల కూడా బరువు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అనంత్ ప్రతి రోజూ ఐదు నుంచి 6 గంటల పాటు వ్యాయామం చేస్తారు. అలాగే 21 కిలోమీటర్లు నడుస్తారట. ఇలా అనంత్ అంబానీ డైట్ కొనసాగుతుంది. కాబా అనంత్ అంబానీకి ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నాయి. దాని కోసం స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల ఆయన విపరీతంగా బరువు పెరుగుతున్నారు.