Corona Virus: కరోనా సోకకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా.. ఇలా చేస్తే అపాయం తప్పినట్టే..

కరోనా... ప్రస్తుతం దేశాన్ని కబలిస్తోంది. లక్షల మందిని బలితీసుకుంటూ.. మరణా హోమాన్ని తలపిస్తోంది.

Corona Virus: కరోనా సోకకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా.. ఇలా చేస్తే అపాయం తప్పినట్టే..
Corona Virus

Updated on: Apr 24, 2021 | 7:43 AM

కరోనా… ప్రస్తుతం దేశాన్ని కబలిస్తోంది. లక్షల మందిని బలితీసుకుంటూ.. మరణా హోమాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది హాస్పిటల్స్‏లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటికే పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం పద్దతిని అవలంబిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ మరింత భయంకరంగా వ్యాపిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అటు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణి జరుగుతున్నా.. ఈ మహమ్మారి విజృంభణ మాత్రం తగ్గడం లేదు. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తిరిగి లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఆకలిచావులు పెరిగే అవకాశం లేకపోలేదు. అలా కాకుండా.. మనకు.. మన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి భారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

మీ కుటుంబంలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపించగానే.. టెస్టుల కన్నా ముందే అతను మిగతా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్లో ఉండాలి. అలాగే సాధారణ జ్వరం, దగ్గు మాములు లక్షణాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటే చాలా మంచిది. లక్షణాలున్న వ్యక్తితో సహా కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరూ చేతులు తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్నపిల్లలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎక్కువమంది గుమిగూడే ప్రాంతాలకు, వేడుకలకు అస్సలు వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల లక్షణాలున్న వ్యక్తికి టెస్టుల అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, చాలావరకు మిగతా కుటుంబసభ్యులకు, ఇతరులకు సోకకుండా ఉంటుంది.

పాజిటివ్ వచ్చిన తర్వాత స్వల్ప లక్షణాలు ఉన్నా.. ఇంట్లోనే ప్రత్యేకంగా గదిలో ఉండాలి. అలాగే మిగతా ఇంటి సభ్యులకు దూరంగా ఉండే అవకాశం లేకపోతే ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ కేంద్రాలకు పంపించడం మంచిది. కరోనా సెకండ్‌ వేవ్‌లో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ముందు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఒకరికి వస్తే అందరికీ సోకే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతమున్న వైరస్‌ వేరియంట్ల వ్యాప్తి వేగం గతంలో కంటే 50% నుండి 150 % ఎక్కువగా ఉంది. గాలి, వెలుతురు లేని ప్రాంతాల్లో ఇది మరింత వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తం కావడం అనేది చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉంటారు.

Also Rea: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

Follow Us