ఇంట్లో ఆడపిల్లలు కాళ్లకి వెండిపట్టీలు కట్టుకొని తిరుగుతూ ఉంటే.. సాక్ష్యత్తూ లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి నడిచి వచ్చినట్లుగా భావిస్తారు పెద్దలు. ఆడవాళ్లు కాళ్లకు ధరించే వెండి పట్టీల వల్ల వారి కాళ్లకి అందానివ్వడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయంటున్నారు నిపుణులు. పట్టీల వెనుక ఉన్న సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. పాదాలకు వెండి పట్టీలు ధరించటం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. కాబట్టి పట్టీలు ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వెండి పట్టీలను ధరించడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇది వారిలో ఇమ్యూనిటీని పెంచుతుంది. కేవలం ఆకర్షణ కోసం, లేదంటే, సంప్రదాయం కోసమే మాత్రమే కాదు స్త్రీలలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈ పట్టీలు చెక్ పెడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడవారిలో నెలసరి సమయంలో వివిధ రకాల నొప్పులతో బాధ పడే వారు వెండి పట్టీలు, వెండి మెట్టెలు, వెండి ఆభరణాలను ధరించడం వల్ల ఉపశమనం పొందుతారని చెబుతున్నారు.
నేటి రోజుల్లో చాలామంది ఆర్థరైటీస్ సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆడవారు వెండి ఉంగరాలు, పట్టీలు, మెట్టెల ధరించడం వల్ల ఆ సమస్యను నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
ఆర్థరైటీస్ వచ్చిన వాళ్లు వెండి వస్తువులను ధరించడం వల్ల దాని లక్షణాలను తగ్గించుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి వెండి వస్తువులకు, వెండి ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ ఫెక్షన్ లతో పోరాడే శక్తి లభిస్తుంది.
నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా సాధారణంగా మహిళలు పాదాల నొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అయితే, ఈ సమస్యను పాదాలకు వెండి పట్టీలు ధరించడం ద్వారా పరిష్కరించవచ్చు. కాళ్లకు ధరించే పట్టీల వల్ల ఎముకలకు చేకూరుతుందని చెబుతున్నారు. వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. వెండి గజ్జెలను ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..