Water Melon: పుచ్చకాయ గింజలతో సహా తింటున్నారా.. అయితే ఇవి తెలుసకోండి..

|

Feb 20, 2022 | 6:15 AM

చాలా మంది వేసవి కాలంలో పుచ్చకాయ (Water Melon) తినడానికి ఇష్టపడతారు...

Water Melon: పుచ్చకాయ గింజలతో సహా తింటున్నారా.. అయితే ఇవి తెలుసకోండి..
water melon
Follow us on

చాలా మంది వేసవి కాలంలో పుచ్చకాయ (Water Melon) తినడానికి ఇష్టపడతారు. అందులో ఉండే నీరుతో వేసవిలో కలిగే దాహం తీరుతుంది. అయితే మనం పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో(vitamins) పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్(zink), మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.

లాభాలు

పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. పుచ్చ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత వీటిపైనున్న పొట్టును తీసి తింటే చాలా మంచిది. ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.

పుచ్చకాయ విత్త‌నాలు షుగ‌ర్ ను అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయ విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. అల‌స‌ట త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారు పుచ్చకాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుందికంటిజ‌బ్బుల‌కు కూడా పుచ్చకాయ విత్త‌నాలు బాగ ప‌నిచేస్తాయి. డీహైడ్రేషన్ సమస్య ఉండదు

Read Also.. Health care tips: రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తిన్నారంటే.. థైరాయిడ్‌, బీపీ, ఉబకాయం ఖాయం!