కాకరకాయ(Bitter Gourd) తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ కాకరకాయలో తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే కాకరకాయ తినకుండా ఉండలేరు. కాకరకాయను ఫ్రై చేసినా, ఉడికించినా.. జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందులోని పోషకాలు(Nutrients) శరీరాని(Body)కి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలోనైతే కాకరను తరచుగా తీసుకోవడం మరింత ఫలితాన్నిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
వర్షాకాలంలో కాకరను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను రాకుండా చేస్తాయి. కాకరకాయను తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి, ఇన్ఫెక్షన్లు రావు. కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చేస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసి బరువు తగ్గుతారు. కాకరకాయలో క్యాలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ ఓ వరం. కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులోని చార్న్‌టిన్ పెప్‌టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాకరలోని యాంట్రీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడతాయి. కాకరను తరచుగా తినడం వల్ల చర్మ, రక్త సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గడంలో కాకర ఎంతో ఉపయోగపడుతుంది.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Gas Problem: మీరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..