
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు భారత్‌లోనూ ఎక్కువవుతోంది. పెళ్లికి ముందే స్త్రీ,పురుషులు కలిసి జీవించడమే ఈ సహజీవనం ముఖ్య ఉద్దేశం. 18 ఏళ్లు నిండిన అమ్మాయి, 21 ఏళ్లు నిండిన అబ్బాయి సహ జీవనం చేయొచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే సహ జీవనం చేస్తున్నా మహిళలకు కొన్ని రకాల హక్కులు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ సహ జీవనం చేస్తున్న మహిళలకు ఉండే హక్కులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సహ జీవనం చేస్తువన్న మహిళల ఒకవేళ గృహ హింసకు గురైతే వివాహిత స్త్రీకి ఉండే హక్కులన్ని ఉంటాయి. గృహ హింస నుంచి తనను తాను రక్షించుకోవడానికి సదరు మహిళకు చట్టపరమైన రక్షణ ఉంటుంది. గృహ హింస ఎదుర్కొంటే కోర్టును సైతం ఆశ్రయించవచ్చు ఇక లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న స్త్రీకి తన భాగస్వామి ఇట్లో నివసించేందుకు పూర్తి హక్కు ఉంటుంది.
దీనికి నిరాకరిస్తే.. చట్టం ప్రకారం కోర్టు నుంచి తన హక్కులను పొందవచ్చు. సహ జీవనం చేస్తున్న ఇద్దరు పరస్పర సమ్మతి లేకుండా సంబంధాన్ని తెచ్చుకుంటే. వివాహిత భార్యలాగే మెయింటెనెన్స్ అలవెన్స్ పొందే హక్కు పొందొచ్చు. ఇక లివ్ ఇన్ రిలేషన్ షిప్ తెగిపోతే.. స్త్రీకి ఈ కాలంలో జన్మించిన పిల్లల సంరక్షణను క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది . దీని కోసం, స్త్రీ కోర్టును ఆశ్రయించవచ్చు. పిల్లల హక్కులు మహిళలకు చెందుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..