Lifestyle: సన్‌ స్క్రీన్‌లు నిజంగానే ఎండ నుంచి కాపాడుతాయా.?

|

Apr 15, 2024 | 9:13 AM

సాధారణంగా వేసవిలో సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం పాలిపోతుంది, కాబట్టి ఈ సీజన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే సూర్యుడి UV కిరణాలు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీంతో చర్మం కందిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, సూర్యుని హానికరమైన కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడం..

Lifestyle: సన్‌ స్క్రీన్‌లు నిజంగానే ఎండ నుంచి కాపాడుతాయా.?
Sun Screen
Follow us on

వాతావరణం మారినప్పుడల్లా చర్మ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసిందే. అందుకు అనుగుణంగానే చర్మాన్ని కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇందుకోసం మార్కెట్లో కూడా పలు రకాల ప్రొడక్ట్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇక ప్రస్తుతం సమ్మర్‌ నేపథ్యంలో చర్మాన్ని రక్షించుకునేందుకు మనలో చాలా మంది సన్‌ స్క్రీన్ క్రీమ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే అసలు స్క్రీన్‌ను ఎలా పనిచేస్తాయి.? వీటివల్ల ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా.? ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా వేసవిలో సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం పాలిపోతుంది, కాబట్టి ఈ సీజన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే సూర్యుడి UV కిరణాలు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీంతో చర్మం కందిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, సూర్యుని హానికరమైన కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసమే సన్‌స్క్రీన్ క్రీమ్‌ను ఉపయోగిస్తారు.

సన్‌స్క్రీన్ చర్మంపై ఒక పొరలా పనిచేస్తుంది, సూర్యుడి అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం నేరుగా దెబ్బతినకుండా కాపాడుతుంది. జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ వంటి ముఖ్యమైన పదార్థాలు సన్‌స్క్రీన్‌లలో ఉంటాయి. ఇవి బలమైన సూర్యకాంతి నుండి దెబ్బతినకుండా పోరాడుతాయి, అలాగే చర్మంపై వచ్చే ముడతలను, మచ్చలను తగ్గిస్తాయి. ఇక సన్‌స్క్రీన్ క్రీమ్‌ పనితీరు అందులోని సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ (SPS)పై ఆధారపడి ఉంటుంది.

ఇది ఎంత ఎక్కువగా ఉంటే, సన్‌స్క్రీన్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. సన్‌స్క్రీన్‌లో SPS 15 ఉంటే, చర్మం 15 రెట్లు ఎక్కువ సూర్యరశ్మిని పొందుతుందని అర్థం. తీవ్రమైన సూర్యరశ్మిని నివారించడానికి, ఎల్లప్పుడూ 30-50 SPF ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక కొన్ని రకాల సన్‌ స్క్రీన్స్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. వీటి తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు చర్మం లోపల ఉన్న కణజాలాలకు చేరి హాని చేస్తాయి. వీటిల్ల దురద, ఎరుపు, వాపు వంటి చర్మ సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి మీరు అప్పటికే అలర్జీ సమస్యలతో బాధపడితే సన్‌స్క్రీన్‌లను ఉపయోగించకోవడమే మంచిది. ఇక సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తున్నప్పుడు కళ్లలోకి వెళ్లకుండా చూసుకోవాలి. మొటిమలు ఉన్న వారు కూడా సన్‌స్క్రీన్‌లను వాడకపోవడమే మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..