కోపం సర్వసాధారణమైన ఎమోషన్. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కచ్చితంగా కోపం వస్తుంది. అయితే వినడానికి చిన్న సమస్యే అయినా కొన్ని సందర్భాల్లో కోపం వల్ల ఎన్నో ఇతర సమస్యలకు దారి తీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోపం వల్ల మానసిక ఆరోగ్యం కోల్పోవడమే కాకుండా, బీపీ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇంతకీ మనకు కోపం ఎందుకు వస్తుందో తెలుసా.? ఏముంది మనకు నచ్చని పని ఎవరైనా చేసినా, మనం కోరుకుంది దక్కకపోయినా వెంటనే కోపం వచ్చేస్తుంది అని అంటారా.? అయితే కోపానికి హార్మోన్లు కారణమని మీకు తెలుసా.? సాధారణంగా మనకు కోపం వచ్చినప్పుడల్లా.. శరీరంలోని రెండు ప్రధాన హార్మోన్లు, అడ్రినలిన్ కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. విపరీతమైన ఒత్తిడికి గురైనా లేదా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు శరీరంలో ఈ హార్మోన్లను విడుదల అవుతాయి.. అడ్రినలిన్, కార్టిసాల్ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కండరాలు ఉద్రిక్తంగా మారతాయి.
* కోపం రాగానే లోతైన శ్వాస తీసుకోని నెమ్మదిగా గాలిని బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతం లభిస్తుంది. దీనివల్ల మెదుడుకు పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. అది మిమ్మల్ని మరింత ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో మానసిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
* ఇక మీరు తరచూ కోపానికి గురవుతుంటే మాత్రం.. మీకు ఆ భావన ఎందుకు కలుగుతుందన్న విషయం గురించి లోతుగా ఆలోచించాలి. మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెడుతోన్న అంశం ఏంటో తెలుసుకొని దాని అధిగమించేందుకు ప్రయత్నించాలి.
* ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..