Get Rid of Termites: ఇట్స్ రెయినీ టైమ్.. చెదలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

|

Jul 22, 2024 | 5:54 PM

వర్షా కాలం హాయిగా ఉన్నా సమస్యలు మాత్రం చాలా వస్తాయి. కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు. ఇంట్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. వాతావరణంలో తేమ కారణంగా ఇంట్లోకి కీటకాలు, సూక్ష్మ క్రిములు వచ్చేస్తాయి. వీటి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇంట్లో చెక్క వస్తువులు ఉన్నాయంటే చెదలు పట్టడం గ్యారెంటీ. ఈ చెదల కారణంగా ఇళ్లే దెబ్బతింటుందన్న విషయం మీకు తెలుసా? కలప తినే కీటకాలను చెక్క..

Get Rid of Termites: ఇట్స్ రెయినీ టైమ్.. చెదలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Get Rid Of Termites
Follow us on

వర్షా కాలం హాయిగా ఉన్నా సమస్యలు మాత్రం చాలా వస్తాయి. కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు. ఇంట్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. వాతావరణంలో తేమ కారణంగా ఇంట్లోకి కీటకాలు, సూక్ష్మ క్రిములు వచ్చేస్తాయి. వీటి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇంట్లో చెక్క వస్తువులు ఉన్నాయంటే చెదలు పట్టడం గ్యారెంటీ. ఈ చెదల కారణంగా ఇళ్లే దెబ్బతింటుందన్న విషయం మీకు తెలుసా? కలప తినే కీటకాలను చెక్క పురుగులు వస్తాయి. ఇప్పుడు వాతావరణంలోని తేమ కారణంగా ఇవి చెక్కలపై చేరతాయి. క్రమంగా చెక్క వస్తువులను పాడు చేయడం మొదలు పెడతాయి. మరి ఈ చెద పురుగులకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెనిగర్:

చెద పురుగులను, కీటకాలను నశింపచేయడంలో వెనిగర్ చక్కగా పని చేస్తుంది. వెనిగర్ వాసనకు కీటకాలకు అలర్జీని కలిగిస్తుంది. కాబట్టి కొద్దిగా నిమ్మరసం తీసుకోండి. అందులో వెనిగర్ కలిపి మీ చెక్క ఫర్నీచర్స్‌పై స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల చెద పురుగులు పూర్తిగా తగ్గుతాయి.

లవంగాలు:

లవంగాలతో కూడా చెద పురుగులను, కీటకాలను నాశనం చేయవచ్చు. లవంగాలను నీటిలో వేసి బగా మరిగించాలి. లవంగాల నుంచి ఘటు వాసన బాగా వస్తుంది. కాబట్టి ఈ నీటిని ఓ స్ప్రే బాటిల్‌లో వేయాలి. తరచూ చెదలు పట్టిన ప్రదేశంలో స్ప్రే చేస్తూ ఉంటే చెదలు పురుగు నశిస్తాయి.

ఇవి కూడా చదవండి

వేప నూనె:

చెదలను వేప నూనెతో కూడా లేకుండా చేయవచ్చు. ఎందుకంటే వేప నూనె నుంచి కూడా ఘాటు సువాసన వస్తుంది. అంతేకాకుండా చేదుగా కూడా ఉంటుంది. చెద పురుగులను తరిమికొట్టడంలో వేప నూనె చక్కగా సహాయ పడుతుంది. ఈ నూనెతో ఇంట్లోని దోమలు, ఈగలు, బొద్దింకలు వంటి వాటిని కూడా వదిలించుకోవచ్చు. కొద్దిగా వేప నూనె తీసుకుని చెదలు పట్టిన భాగంలో స్ప్రే చేయండి. లేదంటే ఓ కాటన్ క్లాత్‌తో కూడా రాయవచ్చు. ఇలా చేయడం వల్ల చెద పురుగులు పోతాయి.

అదే విధంగా దోమలు, బొద్దింకలు, ఈగలను తరిమికొట్టడానికి ఓ స్ప్రే బాటిల్‌లో ఆయిల్ వేసి కిటికీలు, తలుపులు, గ్యాస్ కట్టు దగ్గర, మంచం కింద, గది మూలల్లో పడుకునే ఓ గంట ముందు స్ప్రే చేయండి. వేప నూనె వాసనకు కీటకాలు ఇంట్లోంచి బయటకు పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..