Lifestyle: ఇంట్లో పనులు చేస్తే చాలు.. వ్యాయామం కూడా అక్కర్లేదు..

వ్యాయామం చేయడాన్ని చాలా మంది తప్పనిసరిగా మార్చుకుంటున్నారు. ఉదయం లేదా సాయంత్రం ఇలా సమయం వీలైనప్పుడల్లా జిమ్‌ల బాటపడుతున్నారు. లేదంటే కనీసం ఇంట్లోనే థ్రెడ్‌ మిల్‌ లేదా సైక్లింగ్‌ చేస్తున్నారు. అయితే మనం ఇంట్లో చేసే కొన్ని పనుల వల్ల ఎలాంటి వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదని మీకు తెలుసా.?

Lifestyle: ఇంట్లో పనులు చేస్తే చాలు.. వ్యాయామం కూడా అక్కర్లేదు..
Lifestyle News

Updated on: Jan 28, 2024 | 4:44 PM

ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండడానికి వ్యాయామం బెస్ట్‌ ఆప్షన్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ప్రతీ ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. దీంతో వ్యాయామం చేయడాన్ని చాలా మంది తప్పనిసరిగా మార్చుకుంటున్నారు. ఉదయం లేదా సాయంత్రం ఇలా సమయం వీలైనప్పుడల్లా జిమ్‌ల బాటపడుతున్నారు. లేదంటే కనీసం ఇంట్లోనే థ్రెడ్‌ మిల్‌ లేదా సైక్లింగ్‌ చేస్తున్నారు. అయితే మనం ఇంట్లో చేసే కొన్ని పనుల వల్ల ఎలాంటి వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదని మీకు తెలుసా.? అవును రెగ్యులర్‌గా ఇంట్లో చేసే కొన్ని పనులతో వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను పొందొచ్చు. ఇంతకీ ఆ పనులు ఏంటంటే..

* ఇంటిని శుభ్రం చేయడం మంచి వ్యాయామం లాంటిది. ప్రస్తుతం ఇంటి పనులకు పని మనుషులను పెట్టుకొని బయటకు వ్యాయామాలు చేస్తున్నారు. కానీ అలాకాకుండా ఇంటి శుభ్రం ఉంచుకునే కొన్ని పనులను స్వయంగా చేయడం వల్ల మంచి వ్యాయామం అవుతుంది. ముఖ్యంగా ఇంటిని ఊడ్చడం, గిన్నెలు కడగడం వంటి బెస్ట్‌ వ్యాయామంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పనులు చేసే సమయంలో మీ చేతులు, కాళ్లు నిరంతరం కదులుతూనే ఉంటాయి. నిత్యం వంగడం, గది అంతా తిరగడం అన్ని శరీరాన్ని డైనమిక్‌గా ఉంచుతాయి. ఈ పనులను చేయడం వల్ల కేలరీలు బర్న్‌ అవుతాయి. అధిక బరువు కూడా తగ్గుతుంది.

* గార్డెనింగ్ కూడా బెస్ట్ వ్యాయామంగా చెప్పొచ్చు. మొక్కల సంరక్షణకు నీరు పోయడం, కలుపు మొక్కలు తొలగించడం, గడ్డి కోయడం, ఎరువులు వేయడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ శరీరం మొత్తం డైనమిక్‌గా ఉంటుంది. వంగడం, తిరగడం, బరువులు ఎత్తడం వంటివి చేయడం వల్ల చేతులు, కాళ్ల కండరాలు బలపడతాయి. ఇవన్నీ శక్తితో కూడుకున్న పనులు కావడంతో కేలరీలు బర్న్‌ అవుతాయి.

* ఇక మెట్లు ఎక్కడాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. శరీరం ఫిట్‌గా ఉండడానికి మెట్లు ఎక్కడం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రోజులో కనీసం 10 నుంచి 15 నిమిసాలు మెట్లు, దిక్కడం చేస్తే.. కాళ్ల కండరాలు బలంగా మారుతాయి. మెట్లు ఎక్కేటప్పుడు, మీ కాళ్లు, వీపు, తొడలు కండరాలు బలంగా మారుతాయి.

* దుస్తులు స్వయంగా ఉతుక్కోవడం కూడా బెస్ట్‌ వ్యాయామంగా ఉపయోగపడుతుంది. మీరు స్వయంగా దుస్తులు ఉతుక్కుంటే.. పూర్తి శారీరక వ్యాయామం చేసినట్లు అవుతుంది. దుస్తులను ఉతకడం, ఆరేయడం వంటి చేయడం వల్ల భుజాల కండరాలు బాగా పనిచేస్తాయి దీంతో భుజం నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి పనులను స్వయంగా చేసుకోవడం ద్వారా సహజంగానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..