AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందారం ఆకులలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతూనే ఉంటుంది..

జుట్టు రాలడం, సన్నబడటం, తెల్లజుట్టు సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారంగా మందారం ఆకులతో తయారుచేసే హెయిర్ ప్యాక్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ, నిమ్మ ఆకులు, గుడ్డు, కొబ్బరి నూనెతో తయారయ్యే ఈ ప్యాక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టును ఒత్తుగా, నల్లగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. అయితే ఉపయోగించే ముందు అలెర్జీలు లేదా ఇతర జుట్టు సమస్యలు ఉంటే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మందారం ఆకులలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతూనే ఉంటుంది..
Hibiscus Hair Pack
Shaik Madar Saheb
|

Updated on: Jul 06, 2026 | 4:50 PM

Share

జుట్టు రాలడం, జుట్టు సన్నబడటం, తెల్లజుట్టు వంటి సమస్యలు ఈ రోజుల్లో సాధారణమైపోయాయి. వీటి పరిష్కారం కోసం అనేక ఉత్పత్తులను ఆశ్రయిస్తున్నప్పటికీ, తరచుగా నిరాశే ఎదురవుతుంది. అయితే, మన పూర్వీకులు అనుసరించిన సహజసిద్ధమైన చిట్కాలు ఎంతో ప్రభావవంతమైనవిగా నిరూపితమయ్యాయి. అలాంటిదే ఈ మందారం ఆకుల హెయిర్ ప్యాక్.. ఇది మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా, నల్లగా మార్చి, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఆయుర్వేద నిపుణులు సూచించే.. ఈ పద్దతి.. వంద శాతం గ్యారెంటీగా ఫలితాలను అందింస్తుంది. ఈ ప్యాక్ తయారీ.. వినియోగ విధానం గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

  • మందారం ఆకులు: 10-15 (జుట్టు పొడవును బట్టి)
  • నిమ్మ ఆకులు: 5-6 (లేదా 1 చెంచా నిమ్మరసం)
  • ఉల్లిపాయ: 1 మధ్యస్థాయి
  • గుడ్డు: 1 (పచ్చసొనతో సహా లేదా లేకుండా – ఐచ్ఛికం)
  • కొబ్బరి నూనె: 1/2 చెంచా (లేదా విటమిన్ ఈ క్యాప్సూల్స్, బాదం నూనె, క్యాస్టర్ ఆయిల్)
  • నీరు: కొద్దిగా (గ్రైండ్ చేయడానికి)

తయారీ విధానం:

మందారం ఆకులు శుభ్రపరచడం: ముందుగా, 10-15 మందారం ఆకులను తీసుకోవాలి. బయట నుండి తెచ్చినవి అయితే, వాటిపై ఉన్న దుమ్ము, ధూళిని తొలగించడానికి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన ఆకులను కాసేపు పక్కన పెట్టాలి.

ఉల్లిపాయ సిద్ధం చేయడం: ఒక మధ్యస్థాయి ఉల్లిపాయను తీసుకుని, పై పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది, బట్టతల ఉన్న చోట కూడా జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.

నిమ్మ ఆకులు/రసం: నిమ్మ ఆకులు అందుబాటులో ఉంటే 5-6 తీసుకోవాలి. లేనిపక్షంలో, ఒక చెంచా నిమ్మరసం వాడవచ్చు.

పేస్ట్ తయారీ: ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిమ్మ ఆకులు (లేదా నిమ్మరసం), తుంచి పెట్టుకున్న మందారం ఆకులను వేయాలి. తగినంత నీరు (సుమారు చిన్న గ్లాస్) పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్‌ను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నీరు కలిపేటప్పుడు పేస్ట్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి.

గుడ్డు – నూనె కలపడం: బౌల్‌లోని పేస్ట్‌లో ఒక గుడ్డును (పచ్చసొనతో సహా లేదా పచ్చసొన లేకుండా – మీ సౌలభ్యాన్ని బట్టి) పగలగొట్టి వేయాలి. గుడ్డు జుట్టుకు మంచి ప్రోటీన్‌ను అందించి, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది – జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఆ తర్వాత, అర చెంచా కొబ్బరి నూనె కలపాలి. కొబ్బరి నూనెకు బదులుగా బాదం నూనె, క్యాస్టర్ ఆయిల్ లేదా విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఉపయోగించవచ్చు. అన్నింటినీ బాగా కలిపి, పేస్ట్ తయారుచేసుకోవాలి.

ఉపయోగించే విధానం – ప్రయోజనాలు:

ఈ హెయిర్ ప్యాక్‌ను నూనె రాసిన జుట్టుపై లేదా పొడి జుట్టుపై అప్లై చేయవచ్చు. ముందుగా తలపై స్కాల్ప్‌కు బాగా పట్టించి, ఆపై జుట్టు పొడవునా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత, 30 నుండి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో తల స్నానం చేయాలి.

ప్రయోజనాలు:

జుట్టు రాలడం నియంత్రణ: ఈ ప్యాక్ వాడిన మొదటిసారికే జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది.

జుట్టు పెరుగుదల: మందారం, ఉల్లిపాయ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

నల్లని జుట్టు: ఈ ప్యాక్‌లోని సహజసిద్ధమైన పదార్థాలు జుట్టును నల్లగా మార్చి, తెల్లజుట్టును నియంత్రించడంలో సహాయపడతాయి.

మృదువైన, కాంతివంతమైన జుట్టు: గుడ్డులోని ప్రోటీన్లు – నూనెలు జుట్టుకు పోషణనిచ్చి, మృదువుగా, కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.

ఫ్రిజ్జీ జుట్టుకు చెక్: జుట్టు ముందేలా ఫ్రిజ్జీగా ఉండకుండా, సాఫ్ట్‌గా మారుతుంది.

ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు కష్టంగా భావించకుండా ప్రయత్నించండి. బాలురు, బాలికలు, ఏ వయసు వారైనా దీనిని ఉపయోగించవచ్చు. ఎటువంటి ఖర్చు లేని ఈ చిట్కా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మొదటి వినియోగం నుంచే మీరు తేడాను స్పష్టంగా గమనించవచ్చు. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా మారడానికి ఈ సహజసిద్ధమైన చిట్కాను ప్రయత్నించడం మంచిది..

నోట్.. ఏమైనా అలెర్జీలు ఉన్నా.. ఏమైనా జట్టు సమస్యలతో బాధపడుతున్నా.. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us