
కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించి పొడిబారకుండా కాపాడుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. కొన్ని సహజ పదార్థాలతో ఈ నూనెను కలిపి ఫేస్ మాస్క్ లుగా వాడితే ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.
ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగండి. ఈ మిశ్రమం చర్మాన్ని తేమగా ఉంచి సహజంగా మెరుగుపరుస్తుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడగండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖానికి పట్టించండి. 20 నిమిషాల తర్వాత కడగండి. ఇది ముఖం నుంచి మురికిని తొలగించి సహజమైన కాంతిని ఇస్తుంది.
మెత్తగా చేసిన అవకాడో గుజ్జులో కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది ముఖానికి తేమను ఇచ్చి యవ్వనాన్ని కాపాడుతుంది.
ఒక స్పూన్ ఓట్స్ పొడిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి మాస్క్‌లా ముఖానికి పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పొడి చర్మాన్ని తగ్గిస్తుంది.
ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖానికి మాస్క్ లా వాడండి. 10 నిమిషాల తర్వాత కడగండి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా UV కిరణాల నుంచి రక్షణను కూడా ఇస్తుంది.
అలోవెరా జెల్, కొబ్బరి నూనె కలిపి ముఖానికి మాస్క్ లా ఉపయోగించండి. 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది చర్మానికి మృదుత్వాన్ని ఇవ్వడంతో పాటు చల్లదనాన్ని కూడా ఇస్తుంది.
అరటిపండును మెత్తగా చేసి అందులో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది తక్షణ ప్రకాశాన్ని తీసుకురాగలదు.
కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడకుండా సహజ పదార్థాలతో ముఖాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచాలంటే ఈ కొబ్బరి నూనెతో తయారు చేసిన ఫేస్ మాస్క్ లు అద్భుతంగా పని చేస్తాయి. వీటిని వారానికి 2 నుంచి 3 సార్లు వాడడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)