Banana: అరటి పండు తింటే.. నిజంగానే మంచి నిద్ర సొంతమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు

|

Aug 30, 2024 | 11:03 AM

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియంతో పాటు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరాన్ని రిలాక్స్ చేయడంతో పాటు, ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతాయి. మెగ్నీషియం శరీరాన్ని విశ్రాంతికి ఉపక్రమించేలా చేస్తుంది, విటమిన్ B6 మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ పోషకాలు నిద్రలేమిని...

Banana: అరటి పండు తింటే.. నిజంగానే మంచి నిద్ర సొంతమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Eating Banana
Follow us on

కాలంతో సంబంధం లేకుండా నటించే పండ్లలో అరటి ఒకటి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు లభించే అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. ప్రతీ రోజూ ఒక అరటి పండును తీసుకుంటే శరీరంలో ఎన్నో రకాల మార్పులకు దారి తీస్తుందని అంటుంటారు. అరటి పండులోని ఎన్నో మంచి గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి పండును క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే నిజంగానే అరటి పండుకు, నిద్రకు మధ్య సంబంధం ఉందా.? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియంతో పాటు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరాన్ని రిలాక్స్ చేయడంతో పాటు, ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతాయి. మెగ్నీషియం శరీరాన్ని విశ్రాంతికి ఉపక్రమించేలా చేస్తుంది, విటమిన్ B6 మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ పోషకాలు నిద్రలేమిని దూరం చేయడంలో మాత్రం ఉపయోగపడదని నిపుణులు అంటున్నారు. తాజా పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అరటిపండు శరీరానికి కావాల్సిన రోజువారీ పొటాషియం, మెగ్నీషియం అవసరాలలో కొంత భాగాన్ని మాత్రమే తీరుస్తుందని.. నిద్ర నాణ్యతలో మెరుగుదల ఉండదని చెబుతున్నారు.

ఒక అరటి పండు రోజువారీ పొటాషియం అవసరాలలో కేవలం 10% మాత్రమే తీర్చగలదు. అదేవిధంగా, అరటిపండ్లలో మెగ్నీషియం మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది సుమారు 30 mg, అయితే శరీరానికి ప్రతిరోజూ 400 mg మెగ్నీషియం అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్క అరటి పండు మాత్రమే తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు పూర్తి స్థాయిలో అందవని అర్థం. కాబట్టి నిద్రకు ఉపకమ్రించేందుకు అరటి పండు ఒక్కటే ఉపయోగపడుతుందని చెప్పడంలో నిజం లేదు. అరటిపండులో ఉండే మెగ్నీషియం, విటమిన్ B6 శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ తక్కువ మోతాదులోనే. అందుకే అరటిపండ్లను తీసుకుంటే నిద్రలేమి దూరమవుతుందని చెప్పడంలో పూర్తి స్థాయిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

అయితే అరటి పండును తీసుకోవడంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అరటి ఆరోగ్యానికి మేలు చేస్తుంనడంలో నిజం ఉన్నా.. డయాబెటిస్‌ సమస్యలతో బాధపడేవారు మాత్రం అరటి పండుతో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అరటిపండ్లలో సహజ చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో అరటి పండుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..