ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. భారత్ వంటి మూడో ప్రపంచ దేశాలలో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా విస్తరిస్తోంది. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నాడు. భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని 2021 అధ్యయనం చెబుతోంది. నిజానికి.. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేని వ్యాధి. కానీ దీనిని నియంత్రించడం ఒక్కడే మార్టం. మధుమేహం తెలత్తడానికి సరైన కారణం కూడా ఇంకా తెలియరాలేదు. మధుమేహం విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. అలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొన్ని పానీయాలు సేవించాలి. అప్పుడే షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
ఉదయం నిద్ర లేవగానే పరగడుపున నిమ్మరసం వేడి నీటిలో కలిపి తాగవచ్చు. ఈ లెమన్ వాటర్ తాగిన తర్వాత చాలా మందికి ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఏదైనా తిన్న తర్వాత మామూలు నీళ్లలో కాస్త నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు. అన్నం, స్వీట్లు, బిస్కెట్లు పూర్తిగా మానేయాలి. మధ్యాహ్న సమయంలో ఒక చేప లేదా రెండు మాంసం ముక్కలు, సలాడ్, గిన్నె నిండా పప్పులు తినాలి. ఉప్పు, చక్కెర ఈ రెండింటినీ వీలైనంత తక్కువగా వినియోగించాలి. ఈ డిటాక్స్ వాటర్ రోజూ తాగడం ద్వారా అనేక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. షుగర్ ఉన్నవాళ్లు ఈ విధంగా ఆహారాన్ని నియంత్రించినట్లయితే త్వరగా బరువు తగ్గుతారు.
అలోవెరా జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. రుచికి కాస్త చేదుగా అనిపించినా కలబందలోని మెగ్నీషియం ఇన్సులిన్ స్రావానికి సహాయపడుతుంది. దానితో పాటు, కలబంద రక్తంలో గ్లూకోజ్ సమతుల్యతను కాపాడటంలో కూడా సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపుతో కలబంద రసాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
ప్రతి రోజూ ఉసిరి రసం కూడా తాగవచ్చు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరి రసం మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చాలా మంది పొట్లకాయ తినడానికి ఇష్టపడరు. కానీ సొరకాయలోని చేదు షుగర్ కంట్రోల్‌కు చాలా బాగా పనిచేస్తుంది. పొట్లకాయ రసం ఖాళీ కడుపుతో తాగితే మంచింది. అన్నం తినే వారు బియ్యలో పొట్లకాయలను ఉడకబెట్టుకుని తినొచ్చు. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి మెంతులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు ఒక చెంచా మెంతులు నానబెట్టుకోవాలి. నీటిని వడకట్టి మరుసటి రోజు ఉదయం వాటిని తినాలి. ఈ మెంతి నీళ్లని క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా షుగర్ అదుపులో ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.