Diabetes Control Tips: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? అయితే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి చాలు..

|

Jun 16, 2022 | 6:59 PM

క్కెర స్థాయిని అదుపులో ఉంచే ఆహారంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలి. చక్కెర స్థాయి భారీగా పెరిగితే దాని ప్రభావం శరీరంలోని పలు అవయవాలపై పడుతుంది.

Diabetes Control Tips: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? అయితే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి చాలు..
Diabetes
Follow us on

Diabetic Control Tips: ఆహారం ద్వారా మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఆహారం కారణంగా మీ బ్లడ్ షుగర్ తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆహారంలో ఎప్పటికప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూనే ఉండాలి. చక్కెర స్థాయిని అదుపులో ఉంచే ఆహారంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలి. చక్కెర స్థాయి భారీగా పెరిగితే దాని ప్రభావం శరీరంలోని పలు అవయవాలపై పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కళ్లు, మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో మార్పులు కూడా అవసరం. మీ ఆహారంలో ఈ ఐదింటిని చేర్చుకుంటే.. ఇవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

డయాబెటిస్‌ బాధితులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. 

గుడ్డు: మధుమేహ బాధితులు ఎక్కువ నూనె లేదా నెయ్యి తినడాన్ని మానుకోవాలి. దీని కోసం మీరు స్టైర్-ఫ్రై గుడ్లను తినవచ్చు. ఉడికించిన గుడ్ల రుచి మీకు నచ్చకపోతే ఇది మీకు మంచి వంటకం. గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. డయాబెటిక్ పేషెంట్ తప్పనిసరిగా గుడ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రాగి దోస: మధుమేహ బాధితులు ఖచ్చితంగా రాగిని తీసుకోవాలి. రాగి పిండితో జావ లేదా దోసెను తయారు చేసుకోవచ్చు. రాగుల్లో చాలా పోషకాలు ఉన్నాయి. రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శెనగలు: మధుమేహ వ్యాధిగ్రస్తులకు నల్లబెల్లం, శనగలు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావాలంటే శెనగల చాట్ తయారు చేసుకుని తినవచ్చు. పప్పును రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఉడకబెట్టి అందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పచ్చికొత్తిమీర, నిమ్మకాయ వేసి చాట్ లా చేసుకోవాలి. మీరు దీన్ని అల్పాహారంలో లేదా సాయంత్రం స్నాక్స్‌లో తినవచ్చు.

రోటీ: వివిధ రకాల తృణధాన్యాలు మధుమేహ భాధితులకు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా బుక్వీట్ పిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇందులో అధిక ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉపవాస సమయంలో కూడా బుక్వీట్ తీసుకోవచ్చు. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో రోటీ లేదా పరాటా కూడా తయారు చేసుకొని తినవచ్చు.

కలబంద రసం: బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే కలబంద రసాన్ని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. తాజా కలబంద నుంచి రసం తీసుకొని తాగవచ్చు. లేదా మార్కెట్‌లో లభించే కలబంద రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. కలబంద చర్మం, జుట్టు సమస్యలతోపాటు మధుమేహానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..