Dates Seeds for Diabetes: ఖర్జూరం గింజలను పడేస్తున్నారా.. వాటితో షుగర్‌ని కంట్రోల్ చేయవచ్చు..

|

Oct 19, 2024 | 12:37 PM

ప్రస్తుత కాలంలో ఓ మహమ్మారిలా తయారైంది షుగర్ వ్యాధి. మారిన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా యంగ్ ఏజ్‌లో ఉన్న సమయంలోనే చాలా మందిలో డయాబెటీస్ ఎటాక్ చేస్తుంది. షుగర్ ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేసుకోవడం తప్పించి.. ఏమాత్రం తగ్గదు. కాబట్టి రాక ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే చాలు. ఇప్పటికే డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడంలో చాలా చిట్కాలు, హోమ్ రెమిడీస్ తెలుసుకున్నాం. మళ్లీ మీ కోసం ఓ చిట్కా తీసుకొచ్చాం. డ్రై ఫ్రూట్స్‌లో..

Dates Seeds for Diabetes: ఖర్జూరం గింజలను పడేస్తున్నారా.. వాటితో షుగర్‌ని కంట్రోల్ చేయవచ్చు..
Dates Seeds
Follow us on

ప్రస్తుత కాలంలో ఓ మహమ్మారిలా తయారైంది షుగర్ వ్యాధి. మారిన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా యంగ్ ఏజ్‌లో ఉన్న సమయంలోనే చాలా మందిలో డయాబెటీస్ ఎటాక్ చేస్తుంది. షుగర్ ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేసుకోవడం తప్పించి.. ఏమాత్రం తగ్గదు. కాబట్టి రాక ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే చాలు. ఇప్పటికే డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడంలో చాలా చిట్కాలు, హోమ్ రెమిడీస్ తెలుసుకున్నాం. మళ్లీ మీ కోసం ఓ చిట్కా తీసుకొచ్చాం. డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరం కూడా ఒక భాగమే. ఖర్జూరంలో ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే పైన గుజ్జు తిని గింజలు పాడేస్తాం. కానీ ఖర్జూరం గింజలతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చట.. ఇంకా ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. మరి షుగర్‌ని కంట్రోల్ చేయడానికి గింజలను ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్జూరం గింజల డ్రింక్:

ఖర్జూరం గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. మాంగనీస్, జింక్, పొటాషియం, ఫాస్పరస్ వంటివి లభిస్తాయి. ఈ గింజలతో మనం కాఫీ తయారు చేసుకోవచ్చు. ఇతర కాఫీ పొడి, గింజల్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలుసు. కానీ ఖర్జూరం గింజల్లో నాన్ యాసిడ్ లక్షణాలు ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ కూడా.. కాబట్ట ఈ కాఫీ తాగితే చాలా మంచిది. దీన్ని ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు.

షుగర్ ఉన్నవారు ఉదయం, సాయంత్రం చిన్న కప్పు తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ డ్రింక్ రక్తంలో షుగర్ లెవల్స్ పెంచకుండా చేస్తుంది. అంతేకాకుండా అధిక బరువు, ఊబకాయం, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది. లైంగిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

డ్రింక్ ఎలా చేస్తారు?

ముందుగా గింజలను తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని ఒక రాయితో ముక్కలు చేయండి. ఇప్పుడు ఈ ముక్కలను ఓ పాన్‌లో వేసి రంగు మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఈ పొడిని గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగవచ్చు. లేదంటే పాలలో తేనె కలుపుకుని తాగినా పర్వాలేదు. రుచి కాస్త భిన్నంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..