Diabetes: మధుమేహం మహా డేంజర్ గురూ..! అలాంటి లక్షణాలుంటే ఈ సమస్యలు తలెత్తడం ఖాయమట.. అవేంటంటే..

|

Nov 28, 2022 | 9:53 AM

చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేవారుంటారు.. ఇంకా.. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటూ ఒక్కసారిగా ఆవేశపూరితంగా వ్యవహరించేవారుంటారు. ఇన్ని సంవత్సరాలుగా పెద్దగా మాట్లాడని వారు..

Diabetes: మధుమేహం మహా డేంజర్ గురూ..! అలాంటి లక్షణాలుంటే ఈ సమస్యలు తలెత్తడం ఖాయమట.. అవేంటంటే..
Diabetes Mental Health
Follow us on

Diabetes – mental health : చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేవారుంటారు.. ఇంకా.. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటూ ఒక్కసారిగా ఆవేశపూరితంగా వ్యవహరించేవారుంటారు. ఇన్ని సంవత్సరాలుగా పెద్దగా మాట్లాడని.. వారు ఒక్కసారిగా కోప్పడటం, చికాకుపడటం లాంటి లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు మథుమేహం ఉన్నవారిలో కనిపిస్తే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. మధుమేహం దీర్ఘకాలం కొనసాగితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్.. దీనికి సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు. మధుమేహం తీవ్రమవ్వడం, లేదా రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు గందరగోళం, భయం, ఆందోళన, చికాకు, చూపు మసకబారడం లాంటివి మొదలవుతాయి. బ్లడ్ షుగర్ నియంత్రించకపోతే, అది హెచ్చుతగ్గులకు లోనవుతుంది. దీంతో తరచుగా మానసిక స్థితి వేగంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు మారినప్పుడు ఒక వ్యక్తి మానసిక స్థితి కూడా వేగంగా మారుతుంది. ఈ పరిస్థితిని నిర్వహించడం కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నదని జ్యోతి కపూర్ తెలిపారు.

‘‘రక్తంలో చక్కెర స్థాయి తగ్గితే.. గందరగోళం, భయం, ఆత్రుత లాంటి అనుభూతి చెందడం మొదలవుతాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.’’ అని జ్యోతి కపూర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఏకాగ్రత కోల్పోవడం రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి చూపు లేదా దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఉంటుంది. అలాంటి వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. అలసిపోవడం, శక్తి లేకపోవడం కూడా కనిపిస్తుంది. మధుమేహం ఒక వ్యక్తి లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..

ఒక వ్యక్తి వారి మానసిక స్థితి లేదా ఏదైనా ఇతర లక్షణాలలో వేగంగా హెచ్చుతగ్గులను గమనిస్తే.. అది మానసిక ఆరోగ్య పరిస్థితిని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో వైద్యుడిని తక్షణమే సంప్రదించాలని సూచించారు.. జ్యోతి కపూర్.. ఇలాంటి లక్షణాలు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని పేర్కొన్నారు.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి