డెస్క్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కుర్చీపై కూర్చుని చేసే సులువైన యోగాసనాలు! వీపు, నడుము నొప్పి పరార్‌..

ప్రస్తుత కంప్యూటర్, కార్పొరేట్ యుగంలో చాలామంది రోజుకు 8 నుండి 10 గంటల పాటు డెస్క్ ముందే గడుపుతున్నారు. దీనివల్ల నడుము, వెన్ను, మెడ, భుజాల నొప్పులు కామన్ ప్రాబ్లమ్స్‌గా మారాయి. ఆఫీస్ పనివేళల్లో ప్రత్యేకంగా వ్యాయామం చేయడానికి సమయం దొరకని వారి కోసం చేర్ యోగా ఒక అద్భుతమైన మార్గం. మీ కుర్చీలోనే కూర్చుని ఈ 4 యోగాసనాలు చేయడం ద్వారా వెన్నునొప్పికి గుడ్‌బై చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

డెస్క్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కుర్చీపై కూర్చుని చేసే సులువైన యోగాసనాలు! వీపు, నడుము నొప్పి పరార్‌..
Chair Yoga For Office Workers

Updated on: Oct 07, 2026 | 3:56 PM

ఆఫీసుల్లో లేదా డెస్క్ జాబ్‌లలో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల తీవ్రమైన నడుము, వెన్ను, మెడ నొప్పులతో బాధపడే ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా కూర్చోకపోవడం వల్ల వెన్నుపాముపై ఒత్తిడి పెరిగి కండరాలు బిగుసుకుపోతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా చేర్ యోగా ఎంతగానో తోడ్పడుతుంది. రోజూ ఆఫీసులోనే కుర్చీపై కూర్చుని సులభంగా చేసుకునే క్యాట్-కౌ స్ట్రెచ్, సీటెడ్ స్పై నల్ ట్విస్ట్, చేర్ పిజన్ పోజ్, ఈగిల్ ఆర్మ్స్ వంటి కొన్ని యోగాసనాలు వెన్నుపామును సరళంగా మార్చి, ఒత్తిడిని తక్షణమే తగ్గిస్తాయి. వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం..

1. చేర్ క్యాట్-కౌ స్ట్రెచ్

చేసే విధానం: కుర్చీపై నిటారుగా కూర్చుని, రెండు చేతులను మోకాళ్లపై ఉంచండి. శ్వాస తీసుకుంటూ ఛాతీని ముందుకు చాచి, భుజాలను వెనక్కి జరుపుతూ పైకి చూడండి. ఆ తర్వాత శ్వాస వదులుతూ వెన్నును వెనక్కి వంచి, గడ్డాన్ని గుండెకు ఆనించడానికి ప్రయత్నించండి.

ప్రయోజనం: దీనిని 5-10 సార్లు చేయడం వల్ల వెన్నుపాము శీఘ్రంగా సరళత పొందుతుంది. మెడ, నడుము పైభాగంలో ఉన్న ఒత్తిడి దూరమవుతుంది.

ఇవి కూడా చదవండి

2. సీటెడ్ స్పై నల్ ట్విస్ట్

చేసే విధానం: కుర్చీలో తిన్నగా కూర్చుని, ఎడమ చేతిని కుడి మోకాలుపై ఉంచండి. కుడి చేతిని కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోవడానికి తిప్పండి. శరీరం పైభాగాన్ని కుడివైపునకు తిప్పి వెనుకకు చూడండి. కొద్ది సెకన్ల తర్వాత రెండో వైపు కూడా ఇలాగే చేయండి.

ప్రయోజనం: నిరంతరం కూర్చోవడం వల్ల నడుము బిగుసుకుపోతే, ఈ ఆసనం నడుము కండరాలను సడలించి పచనక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

3. చేర్ పిజన్ పోజ్:

చేసే విధానం: కుర్చీపై కూర్చుని కుడి కాలును ఎత్తి ఎడమ తొడపై ఉంచండి. వెన్నుపామును నిటారుగా ఉంచి నెమ్మదిగా ముందుకు వంగండి. 30 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండి, ఆ తర్వాత కాలు మార్చి చేయండి.

ప్రయోజనం: గంటల తరబడి కూర్చోవడం వల్ల బిగుసుకుపోయే పిరుదులు, తొడల కండరాలను ఇది మోకాళ్ల సడలింపునకు ఉపయోగపడుతుంది. సయాటికా నొప్పులను తగ్గిస్తుంది.

4. సీటెడ్ ఈగిల్ ఆర్మ్స్:

చేసే విధానం: రెండు చేతులను ముందుకు చాచి కుడి చేతిని ఎడమ చేతి చుట్టూ తిప్పి అరచేతులను కలపండి. మోచేతులను భుజాల మట్టానికి పైకి లేపి, అరచేతులను ముఖానికి కాస్త దూరంగా ఉంచండి.

ప్రయోజనం: భుజాలు, మెడ, నడుము పైభాగంలోని నొప్పులను తగ్గించడంలో ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు:

ప్రతి 1-2 గంటలకొకసారి కుర్చీ నుంచి లేచి 2 నిమిషాలు నడవాలి. కంప్యూటర్ స్క్రీన్‌ను కంటిచూపు మట్టంలో ఉంచుకోవడం ముఖ్యం. నొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us