డెంగ్యూ నుంచి కోలుకున్నా బలహీనంగా ఉంటే.. త్వరగా కోలుకోవడానికి, శక్తిని పెంచడానికి ఈ పనులు చేయండి.

|

Aug 06, 2024 | 10:15 AM

డెంగ్యూ బారిన పడిన వ్యక్తుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతుంది. దీని కారణంగా శరీరంలో చాలా బలహీనత ఉంటుంది. అందువల్ల కోలుకున్న తర్వాత కూడా చాలా రోజులు బలహీనంగా శక్తిలేనట్లు ఉంటారు. కనుక డెంగ్యూ నుంచి బయట పడిన తర్వాత బలహీనత నుంచి బయట పడడానికి కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

డెంగ్యూ నుంచి కోలుకున్నా బలహీనంగా ఉంటే.. త్వరగా కోలుకోవడానికి, శక్తిని పెంచడానికి ఈ పనులు చేయండి.
Post Dengue Diet
Follow us on

వర్షాకాలంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు వర్షాల వలన చాలా చోట్ల నీరు నిల్వ ఉంటుంది. దీంతో అనేక వైరల్ జ్వరాలతో పాటు డెంగ్యూ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీని నివారణకు దోమలను తరిమికొట్టడంతో పాటు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇక డెంగ్యూ బారిన పడినట్లు అయితే జ్వరం తగ్గిన తర్వాత కూడా రోగి చాలా బలహీనంగా ఉంటాడు. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కనుక డెంగ్యూ జ్వరం సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వలన త్వరగా కోలుకోవడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

డెంగ్యూ బారిన పడిన వ్యక్తుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతుంది. దీని కారణంగా శరీరంలో చాలా బలహీనత ఉంటుంది. అందువల్ల కోలుకున్న తర్వాత కూడా చాలా రోజులు బలహీనంగా శక్తిలేనట్లు ఉంటారు. కనుక డెంగ్యూ నుంచి బయట పడిన తర్వాత బలహీనత నుంచి బయట పడడానికి కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

పాలు, పాల ఉత్పత్తులను తీసుకోండి

ఇవి కూడా చదవండి

డెంగ్యూ నుండి కోలుకున్న తర్వాత కూడా అలసటగా ఉంటారు. అంతేకాదు ఎముకలు, కండరాలలో నొప్పి వంటి లక్షణాలు చాలా కాలం పాటు ఉంటాయి. దీని నుండి కోలుకోవడానికి రోజువారీ ఆహారంలో పాలను చేర్చుకోండి. అంతేకాదు పెరుగు, చీజ్ మొదలైన ఇతర పాల ఉత్పత్తులు కూడా తీసుకోవాలి. ఇవి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.

విటమిన్ సి ఉన్న పండ్లను తినండి
డెంగ్యూ తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే బలహీనమైన శరీరం ఉన్న వారు ఇతర ఫ్లూ బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందువల్ల రోజువారీ ఆహారంలో నారింజ, కివీ, ద్రాక్ష వంటి విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను చేర్చుకోండి. ఇవి శరీర శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి
డెంగ్యూ వల్ల కలిగే బలహీనతను అధిగమించడానికి, సమతుల్య ఆహారం తీసుకోవడమే కాదు పుష్కలంగా నీరు త్రాగటం, ఆహారంలో ద్రవ పదార్థాలు, పండ్లు, కూరగాయల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ మొదలైనవి చేర్చుకోవడం చాలా ముఖ్యం.

తగినంత నిద్ర పోవాలి
బలహీనతను అధిగమించడానికి శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరం. కనుక రోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. అది కూడా సరైన సమయానికి నిద్రపోవడం మరింత ముఖ్యం. అంటే ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు భోజనం చేసి, రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడం మంచిది. తద్వారా మీ ఉదయం దినచర్యకు ఆటంకం కలగదు. సరైన దినచర్యను అనుసరించడం వలన డెంగ్యూ వలన కలిగే నీరసం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..