Telugu News Lifestyle Deadly Dangers of Sleeping with the Heater On All Night – Don’t Ignore These This Winter!
Be Alert: చలిగా ఉందని రూమ్ హీటర్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ విషయాలు తెలుసా!
చలికాలం వచ్చిందంటే వణికించే చల్లని గాలులు, పొగమంచుతో శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ చలిని తట్టుకోవడానికి మనం రకరకాల పద్ధతులు అవలంబిస్తాం. మందపాటి బ్లాంకెట్లు, హీటర్లు, బ్లోయర్లు, ఎలక్ట్రిక్ హీటర్ బ్యాగులు, రూమ్ హీటర్లు, గది మూసుకుని వేడి నిలువ చేసుకోవడం. కొందరు ..
చలికాలం వచ్చిందంటే వణికించే చల్లని గాలులు, పొగమంచుతో శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ చలిని తట్టుకోవడానికి మనం రకరకాల పద్ధతులు అవలంబిస్తాం. మందపాటి బ్లాంకెట్లు, హీటర్లు, బ్లోయర్లు, ఎలక్ట్రిక్ హీటర్ బ్యాగులు, రూమ్ హీటర్లు, గది మూసుకుని వేడి నిలువ చేసుకోవడం. కొందరు రాత్రంతా హీటర్ ఆన్ చేసి హాయిగా నిద్రపోతారు.
కానీ ఈ సౌకర్యం వెనుక దాగి ఉన్న ప్రమాదాలు ఎవరికీ తెలియవు! ఆక్సిజన్ తగ్గడం, చర్మం పొడిబారడం నుంచి ఫైర్ హజార్డ్ వరకు హీటర్‌తో చాలా ప్రమాదం ఉంది. గదిలో హీటర్ పెట్టుకుని నిద్రపోతే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..
హీటర్ గదిలోని గాలిని వేడి చేస్తుంది కానీ ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. రాత్రంతా మూసిన గదిలో హీటర్ పెడితే మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా తలనొప్పి, మైకం, ఉదయాన్నే అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
హీటర్ గాలిలోని తేమను పీల్చేస్తుంది. చర్మం పొడిబారడం, పెదవులు పగులు, దురద, అలర్జీలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో చర్మం ముడతలు పడుతుంది.
పొడి గాలి వల్ల గొంతు ఇరిటేట్ అవుతుంది. దగ్గు, జలుబు, సైనస్ సమస్యలు త్వరగా వస్తాయి. పిల్లలు, వృద్ధులకు ఈ ప్రమాదం ఎక్కువ. హీటర్ ధూళిని, బ్యాక్టీరియాను గాలిలోకి విడుదల చేస్తుంది. దీన్ పీల్చడం వల్ల అలర్జీ, ఆస్తమా రోగులకు శ్వాస సమస్యలు ముదిరిపోతాయి.
శరీరం డీహైడ్రేట్ అవుతుంది. రాత్రంతా హీటర్ గాలి శరీరం నుంచి నీటిని ఆవిరి చేస్తుంది. ఉదయాన్నే నోరు ఎండిపోవడం, తలతిరగడం సహజం.
చవకైన హీటర్లు ఓవర్‌హీట్ అయ్యి నిప్పు రావచ్చు. గత ఏడాది దేశవ్యాప్తంగా ౩౦౦కు పైగా ఫైర్ యాక్సిడెంట్లు హీటర్ల వల్లే జరిగాయి. హీటర్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి సరిగా నిద్ర పట్టదు. ఉదయాన్నే అలసట, చిరాకు వస్తాయి.
హీటర్ని రాత్రంతా ఆన్‌లో ఉంచకుండా నిద్రపోయే 30 నిమిషాల ముందు ఆపేయాలి. గదిలో ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉంచాలి, దీనివల్ల గదిలో తేమ పెరుగుతుంది.
ఆటో కట్ ఆఫ్ ఉండే మంచి క్వాలిటీ హీటర్ని మాత్రమే ఉపయోగించాలి. గది కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల బయటనుంచి లోపలికి, లోపలి నుంచి బయటకు గాలి మార్పిడి జరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ హీటర్ని ఉపయోగించవచ్చు.NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.