Winter Health Tips: ఖర్జూరం vs బాదం: ఆరోగ్యానికి ఏది మంచింది.. నిపుణులు చెప్తుందేంటి?

చలికాలంలో ఆహారంపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగనిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా మనం త్వరగా జబ్బుల భారీన పడుతాం ఇలా జరగకూడదంటే.. ఈ సీజన్‌లో మనం శరీరానికి శక్తినిచ్చే, వెచ్చగా ఉంచే, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. ఈ విషయంలో, ఖర్జూరాలు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Winter Health Tips: ఖర్జూరం vs బాదం: ఆరోగ్యానికి ఏది మంచింది.. నిపుణులు చెప్తుందేంటి?
Winter Health Tips

Updated on: Jan 18, 2026 | 6:53 PM

ఖర్జూరం, బాధం రెండు మన ఆరోగ్యానికి మేలు చేసేవే.. వీటిలో ఉండే పోషకాలు మన మొత్తం శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మొదట ఖర్జూర వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూసుకుంటే. వీటిలొ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. శీతాకాలంలో వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇది జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది. డేలీ 2-3 ఖర్జూరాలు తినడం వల్ల అలసట తగ్గుటమే కాకుండా శరీరం చురుగ్గా ఉంటుంది. ఖర్జూరాలలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది శీతాకాలపు బలహీనత, హిమోగ్లోబిన్ లోపాన్ని నివారిస్తుంది. అలాగే ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, ఖర్జూరాలను మితంగా తీసుకోవాలి. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువును నియంత్రించుకోవాలనుకునే వారు వాటిని అధికంగా తినకూడదు.

బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బాదం తినడం వల్ల కూడా మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఖర్జురాలా తక్షణ శక్తిని ఇవ్వవు.. కానీ స్లోగా శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి, ఇవి శీతాకాలంలో శరీరాన్ని బలంగా, వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. బాదంలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది, ఇది చల్లని వాతావరణంలో పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బాదం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతేకాదు బాదం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలొ కూడా సహాయపడుతుంది.

శీతాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది

ఖర్జూరం vs బాదం: చలికాలంలో ఈ రెండూ ఆరోగ్యకరమైనవే. ఒక వేళ ఈ సీజన్‌లో మీరు తరచూ బలహీనంగా, చలిగా లేదా అలసిపోయినట్లు అనిపిస్తే, మీకు ఖర్జూరం ఉత్తమమైనది. ఎందుకంటే అవి తక్షణ శక్తిని, వెచ్చదనాన్ని అందిస్తాయి. అయితే, మీరు దీర్ఘకాలిక బలం, రోగనిరోధక శక్తి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే బాదం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ ఆహారంలో రెండింటినీ చేర్చుకోవడం మంచిది . రోగనిరోధక శక్తి, బలం కోసం ఉదయం 10-12 నానబెట్టిన బాదంపప్పులను తినండి. అలాగే శక్తి, వెచ్చదనం కోసం రోజూ 1 లేదా 2 ఖర్జూరాలను తినండి. ఖర్జూరాలు, బాదంపప్పుల ఈ కలయిక ఈ శీతాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.