Monsoon Home Care: వర్షాలకు భయపడి ఇంట్లోనే తడి బట్టలు ఆరబెడుతున్నారా?.. భయంకరమైన ప్రమాదం!

వర్షాకాలంలో నిరంతరం పడే వానల వల్ల ఉతికిన బట్టలను బయట ఎండలో ఆరబెట్టడం కష్టతరంగా మారుతుంది. దీనితో చాలామంది ఇంట్లోని గదుల్లో, హాల్‌లో లేదా ఫ్యాన్ కింద దారాలు, స్టాండ్లు కట్టి తడి బట్టలను ఆరబెడుతుంటారు. వెలుతురు, గాలి సరిగ్గా లేని గదుల్లో బట్టలు ఆరే వరకు అక్కడే ఉంచేస్తుంటారు. దీని కారణంగా ఎన్ని అనర్థాలో తెలుసా?..

Monsoon Home Care: వర్షాలకు భయపడి ఇంట్లోనే తడి బట్టలు ఆరబెడుతున్నారా?.. భయంకరమైన ప్రమాదం!
Dangers Of Drying Wet Clothes Indoors During Monsoon

Updated on: Jul 29, 2026 | 4:29 PM

బాల్కనీ లేదా బయట కాకుండా ఇంట్లోనే తడి బట్టలను ఆరబెట్టడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తడి బట్టల నుండి వెలువడే తేమ వల్ల గదిలో ప్రమాదకరమైన ఫంగస్, బూజు వృద్ధి చెంది శ్వాసకోశ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మరి ఇంట్లోనే తడి బట్టలు ఆరబెట్టడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు మరియు దీనిని నివారించడానికి పాటించాల్సిన చిట్కాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. ఫంగస్ బూజు పెరగడం
ఉతికిన బట్టల నుండి నీరు ఆవిరై గదిలోని గాలిలో తేమ శాతాన్ని దాదాపు 30 శాతం వరకు పెంచుతుంది. ఈ తేమ వాతావరణం వల్ల గోడలు, మూలలు మరియు సీలింగ్‌పై ‘యాస్పర్గిల్లస్’ వంటి ప్రమాదకరమైన ఫంగస్ స్పూర్స్ వేగంగా పెరుగుతాయి. ఇవి గాలిలో కలవడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.

2. శ్వాసకోశ సమస్యలు ఆస్తమా
గాలిలో పెరిగిన ఫంగస్ మరియు తేమను పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ, గొంతులో నస, నిరంతరం దగ్గు మరియు తుమ్ములు వస్తాయి. ఆస్తమా లేదా అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత డేంజర్. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరిగి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.

3. డస్ట్ మైట్స్ వ్యాప్తి
తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో దుమ్ము పురుగులు వేగంగా వృద్ధి చెందుతాయి. ఇవి పడకలు, సోఫాలు, కార్పెట్లలోకి చేరి చర్మ అలర్జీలు, దురద మరియు తామర వంటి చర్మ వ్యాధులను కలిగిస్తాయి.

4. రోగనిరోధక శక్తి బలహీనపడటం
నిరంతరం తేమ ఉన్న గదుల్లో నివసించడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల చిన్న పిల్లలు, గర్భిణులు మరియు శారీరక రోగాలు ఉన్నవారు త్వరగా ని్యూమోనియా లేదా సైన్స్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు.

ఇంట్లో బట్టలు ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
గాలి వెలుతురు ఉన్న గదిలోనే: బట్టలను పడకగది లేదా హాల్‌లో కాకుండా, వెంటిలేషన్ మరియు కిటికీలు సరిగ్గా ఉన్న గదిలోనే ఆరబెట్టాలి.

ఫ్యాన్ మరియు డిహ్యూమిడిఫైయర్: ఫ్యాన్ ఆన్ చేసి కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచడం వల్ల గాలి పారాడుతుంది. లేదా డిహ్యూమిడిఫైయర్ వాడితే గదిలోని తేమను అది పీల్చుకుంటుంది.

వాషింగ్ మెషిన్ డ్రైయర్ వాడకం: వాషింగ్ మెషిన్‌లోని స్పిన్/డ్రైయర్ ఆప్షన్‌ను రెండుసార్లు ఉపయోగించి బట్టల్లోని నీటిని వీలైనంత ఎక్కువ పిండేసిన తర్వాతే ఆరేయాలి.

బాల్కనీలు లేదా షెడ్స్: వర్షం పడనప్పుడు బాల్కనీలో గ్రిల్స్‌కు లేదా నెట్ ఉన్న ప్రాంతాల్లో ఆరబెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

గమనిక:
ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పైన పేర్కొన్న వివరాలు సాధారణ ఆరోగ్య మరియు గృహ సంరక్షణ నివేదికల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. ఇంట్లో బట్టలు ఆరేయడం వల్ల ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన దగ్గు, ఆయాసం లేదా శ్వాస ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

Loading...
Unable to load recommendations.
Follow Us