Green Tea Side Effects : అలర్ట్! ఈ ఆరోగ్య సమస్యలుంటే గ్రీన్ టీ తాగొద్దు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Sep 02, 2023 | 9:16 PM

గ్రీన్ టీ కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది, ఇది రక్త స్థిరత్వం చిక్కబడటానికి దారితీస్తుంది. పెరుగుతున్న బరువు తగ్గడానికి రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ సరిపోతుంది. ఇంతకు మించి తాగవద్దు. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తాగాలి. లేకుంటే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద వ్యాధులను నివారించవచ్చు.

Green Tea Side Effects : అలర్ట్! ఈ ఆరోగ్య సమస్యలుంటే గ్రీన్ టీ తాగొద్దు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Follow us on

గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీకు లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. అయితే కొందరు దీనిని తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని మీకు తెలుసా..?  గ్రీన్ టీ ఇప్పుడు చాలా ఇదే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇది మన శరీరానికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. కానీ కొందరికి ఇది శరీరానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైనా ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదని చెబుతున్నారు.

గ్రీన్ టీ ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది ప్రజలు బరువు తగ్గడానికి గ్రీన్‌టీ ఉత్తమ మార్గంగా భావిస్తారు. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. పొట్ట, నడుము కొవ్వును సులభంగా కరిగించవచ్చు. అదే సమయంలో క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

అయితే, గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి లివర్ సమస్యలు రావచ్చని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీలోని కాటెచిన్స్, ముఖ్యంగా EGCG (ఎపిగల్లోకాటెచిన్ గాలెట్) కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అవయవానికి సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి గ్రీన్ టీ హానికరం.

ఇవి కూడా చదవండి

పెరుగుతున్న బరువు తగ్గడానికి రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ సరిపోతుంది. ఇంతకు మించి తాగవద్దు. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తాగాలి. లేకుంటే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద వ్యాధులను నివారించవచ్చు.

గర్భీణీలు, సంతానం కోసం ప్లాన్ చేసుకునేవారు కూడా గ్రీన్ టీని ఎక్కువగా తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కెఫీన్ ఉద్దీపన రక్తంలోకి చాలా సులభంగా చేరుకుంటుంది. దీనివల్ల శిశువుల్లో జీవక్రియ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.

గ్రీన్ టీ ఎక్కువగా తాగే వారిలో ప్రమాదకరమైన దుష్ప్రభావం రక్తస్రావం రుగ్మతలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. గ్రీన్ టీలోని కొన్ని సమ్మేళనాలు ప్రమాదకరంగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నిర్వహించడంలో సహాయపడే ప్రోటీన్ అయిన ఫైబ్రినోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. గ్రీన్ టీ కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది, ఇది రక్త స్థిరత్వం చిక్కబడటానికి దారితీస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..