Head Bath: రోజూ తలస్నానం చేస్తే బట్టతల వస్తుందా.? నిపుణులు ఏమంటున్నారంటే..

రోజూ తలస్నానం విషయంలో నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మాత్రం రోజూ తలస్నానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఎక్కువ దుమ్మూ దూళి ప్రాంతాల్లో వాళ్లు, ఎక్కువ చెమట పట్టే వాళ్లు, ఎక్కువ ప్రయాణించేవారు తలస్నానం చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Head Bath: రోజూ తలస్నానం చేస్తే బట్టతల వస్తుందా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Head Bath

Edited By:

Updated on: Jan 10, 2023 | 12:38 PM

‘కొప్పు ఉన్న అమ్మ ఎన్ని ముడులైనా వేస్తుంది’..కొప్పు చూడు కొప్పు అందం చూడు.. ఇలాంటి సామెతలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే జుట్టు ప్రాధాన్యత ఏంటో? ఈ సామెతలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో మనకు ఉన్న ఏకైక అనుమానం రోజూ తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందా? ఈ ప్రశ్నను మనం చాలా మందిని అడిగి ఉంటాం. అంతా చెప్పే సమాధానం..ఎక్కువ తల స్నానం చేస్తే బట్టతల వచ్చేస్తుంది జాగ్రత్త అని హెచ్చిరస్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ వల్ల తలస్నానం చేయకపోతే మనశ్శాంతి ఉండదు. అలాగే గతుకుల రోడ్లు వల్ల ప్రతిరోజూ జట్టుకు దుమ్ము పట్టేసి చిరాకు తెప్పిస్తుంటుంది. కాబట్టి కచ్చితంగా తలస్నానం చేయాలి అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో చేసేస్తుంటాం. అయితే రోజూ తలస్నానం విషయంలో నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మాత్రం రోజూ తలస్నానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఎక్కువ దుమ్మూ దూళి ప్రాంతాల్లో వాళ్లు, ఎక్కువ చెమట పట్టే వాళ్లు, ఎక్కువ ప్రయాణించేవారు తలస్నానం చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే ఎలాంటి సమస్య లేకుండా డైలీ తలస్నానం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

తలస్నానం చేయడం వల్ల ఉపయోగాలు

రోజూ తలస్నానం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని కొన్ని నివేదికలు పేర్కొంటే చాలా ఇబ్బంది పడాలని మాత్రం మరికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే తరచూ స్నానం చేయడం వల్ల కలిగే లాభాలనే విశ్లేషిస్తున్నారు..కానీ నష్టాలు మాత్రం విశ్లేషించలేకపోతున్నారు. తరచూ తలస్నానం చేయడం వల్ల దురద, జుట్టు పొడిబారడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. చుండ్రును కలిగించే శీలింధ్రాలు కూడా తరచూ తలస్నానం చేస్తే తగ్గుతాయి. అలాగే తలస్నానం చేయడం వల్ల ఒత్తిడి సమస్యకు కొంతమేర పరిష్కారం దొరుకుతుంది.  వారానికి ఓ సారి లేదా రెండు సార్లు తలస్నానం చేసేవారికంటే వారానికి ఐదు రోజులు తలస్నానం చేసే వారిలో మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

జుట్టు సంరక్షణకు ఇవి పాటిస్తే సరి

జుట్టు సంరక్షణకు కచ్చితంగా పెద్ద దంతాలు ఉన్న దువ్వెనను ఉపయోగించాలి. అలాగే డైలీ హెయిర్ డయర్ ను ఉపయోగించకూడదు. కెమికల్స్ తక్కువుగా ఉండే షాంపూను ఎంచుకుని లైట్ గా తలస్నానం చేయాలి. అలాగే తలస్నానం చేసినప్పుడు షాంపూ కేవలం జుట్టుకు మాత్రమే పట్టేలా చూసుకోవాలి. తలను మాత్రం ఎక్కువసేపు షాంపూతో మసాజ్ చేయకూడదు. రాత్రి సమయంలో జుట్టుకు నూనె పెట్టకోకూడదు. అలాగే జుట్టు బిరుసుగా, వంకరగా ఉంటే సంబంధిత ప్రొడక్ట్స్ వాడడం ఉత్తమం. 

ఇవి కూడా చదవండి

మొత్తం మీద ఎక్కువ షాంపూ చేయడం వల్ల జుట్టు పాడవుతుందనే నమ్మకాలు పూర్తిగా అశాస్త్రీయమైనవని నిపుణులు చెబుతున్నారు., తేలికపాటి క్లెన్సర్, మీ చర్మానికి సరిపోయే ఉత్పతులో తరచుగా తల స్నానం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..