Ajwain Leaves: ఈ ఆకులు ఎక్కడ కనిపించినా వదలకండి.. రోజుకొక్కటి తిన్నా రోగాలన్నీ పరార్!

ఆరోగ్యానికి మేలు చేసే మొక్కల్లో వాము ఆకు మొక్క ఒకటి. వాము ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని సాంబార్ సోప్పు, సాంబార్ బల్లి, సాంబ్రాణి ఏలే, కర్పూరవల్లి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. దీని ఆకులు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, శరీరానికి చాలా ప్రయోజనకరమైన పలు రకాల ఖనిజాలు..

Ajwain Leaves: ఈ ఆకులు ఎక్కడ కనిపించినా వదలకండి.. రోజుకొక్కటి తిన్నా రోగాలన్నీ పరార్!
Ajwain Leaves

Updated on: Jul 22, 2025 | 8:59 PM

ప్రకృతిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. అయితే మనం వాటిపై అంతగా శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇటువంటి ఆరోగ్యానికి మేలు చేసే మొక్కల్లో వాము ఆకు మొక్క ఒకటి. వాము ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని సాంబార్ సోప్పు, సాంబార్ బల్లి, సాంబ్రాణి ఏలే, కర్పూరవల్లి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. దీని ఆకులు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, శరీరానికి చాలా ప్రయోజనకరమైన పలు రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులు జలుబు, దగ్గు వంటి కాలానుగుణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అందుకే చాలా మంది దీన్ని ఇంటి పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ ఆకులను ఆయుర్వేద మందులలోనూ ఉపయోగిస్తారు. కాబట్టి ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

వాము ఆకుల ప్రయోజనాలు ఇవే..

  • వాకు ఆకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని వినియోగం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
  • వాము ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
  • రోజూ రెండు పెద్ద ఆకులను నమిలి తినడం వల్ల శరీర జీవక్రియ రేటు పెరుగుతుంది.
  • వాము ఆకులను తేనె, వెనిగర్ తో కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.
  • ఈ ఆకులను తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతారు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను సమతుల్యం చేస్తాయి.
  • ఐరన్‌ లోపం ఉన్నవారు వాము ఆకులను తినవచ్చు. ఇది రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది.
  • వాము ఆకులు స్త్రీల ఋతు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కానీ అధికంగా తినకూడదు.
  • వాము ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఆకులను నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది. ఇవి కావిటీస్, దుర్వాసన, ఇతర నోటి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.
    డాండెలైన్ ఆకులలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటి కాలానుగుణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఇవి సహాయపడతాయి.

మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.