Basil Leaves Benefits : అనాధికాలంగా మన ఇంటి ముందర ఉండే ఔషధ మొక్క తులసి.. ఇంటి ముందర ఉంటే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు ఇది నిజమో కాదో తెలియదు కానీ తులసి ఆకులు మాత్రం అనారోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పూర్వకాలం నుంచే ఈ మొక్కను మన పూర్వీకులు, రుషులు సనాతన ఆయర్వేదంలో వాడి ఎన్నో రోగాలను నయం చేసేవారు. తులసి మొక్కకు చాలా ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అందుకు తులసి మొక్కలేని ఇంటి ని మనం ఊహించలేము..
తాజాగా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలందరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు ఆస్పత్రుల్లో బెడ్స్ సరిపోక మరోవైపు ఆక్సిజన్ సరిగ్గా లభించక అమాయక జనాలు ఎందరో తనువు చాలిస్తున్నారు. అయితే తులసి ఆకుల రసంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా తులసి ఆకుల రసాన్ని వాడటం వల్ల ఏ వైరస్ అయినా అంతమవుతుందని నిరూపిస్తున్నారు. తులసి వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ కొన్ని తులసి ఆకులను ఆహారంలో భాగంగా తీసుకుంటూ వుంటే రోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది. తులసిలో వివిధ రసాయన సమ్మేళనాలు 20 శాతం వరకు శరీరంలోని ఇన్ఫెక్షన్-పోరాట ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉత్తమ ఫలితాల కోసం తాజా తులసి ఆకులు ఉపయోగించడం బెటర్. ఎనిమిది తులసి ఆకులు, ఐదు లవంగాలు ఒక కప్పు నీటిలో వేసి 10 నిముషాలు వేడి చేయాలి. రుచి కోసం మీరు కొంత ఉప్పును జోడించవచ్చు. దానిని వడకట్టిన నీటిని తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
రోజు తులసి ఆకులు నమలడం వల్ల శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. కేవలం 100 గ్రాముల తాజా తులసి ఆకులలోఒక రోజులో మనిషికి కావాల్సిన విటమిన్ ఎ ను కలిగి వుంటుంది. అంతే కాదు తాజా తులసి రసంతో అంధత్వ నివారణకు, గొంతు ఇన్ఫెక్షన్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులు కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. మొత్తం మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి, ఖాళీ కడుపుతో నీటి తో అయిదు ఆరు తులసి ఆకులు తినేయాలి. మీ మూత్రపిండాలులో రాళ్ళు కలిగి ఉంటే, తేనెలో తులసి రసం కలిపి తాగాలి. అయిదు నుంచి ఆరు నెలల వరకు ప్రతిరోజూ క్రమం తప్పకుండ చేస్తే కిడ్నీల్లో రాళ్లు తొలగిపోతాయి.
తులసిలో తక్కువ కేలరీల హెర్బ్ యంటి ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో అధికంగా ఉంటుంది. అదనంగా విటమిన్లు ఎ, సి మరియు కె, అలాగే మాంగనీస్, రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం మరియు ఒమేగా -3 కొవ్వులు సహా అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇవన్నీ కరోనా కట్టడికి బాగా పనిచేస్తాయి. ఒక కప్పులో వేడి నీటిని తీసుకుని దానిలో కొన్ని తులసి ఆకులు వేసి కొన్ని నిముషాల పాటు నానాలి. తరువాత ఆ నీటిని నెమ్మదిగా సిప్ చేస్తూ వుండాలి.