ఈ ఆకు ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రోగాలకు చెక్‌ పెడుతుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ఇప్పుడు చెప్పబోయే ఒక్క ఆకు రోజు మన ఆహారంలో ఉండేటట్టు చూసుకుంటే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. ఇక ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే అలాంటి ఆకు ఏమిటి అంటే అది మనందరికీ తెలిసిన కొత్తిమీర..అవును కొత్తిమీర రోజు మన ఆహారంలో చేర్చుకొని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులతో పాటుగా ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.

ఈ ఆకు ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రోగాలకు చెక్‌ పెడుతుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
Health Benefits Of Coriander

Updated on: Aug 25, 2025 | 10:25 PM

కొత్తిమీరలో విటమిన్‌ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్‌, ఐరన్‌, మాంగనీస్‌, కాల్షియం, విటమిన్‌ కె, ఫాస్పరస్‌ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్‌ యాసిడ్‌ ఉంటుంది. లినోలెయిక్‌ యాసిడ్‌ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అజీర్ణానికి కొత్తిమీర మంచి ఔషధం. ఈ ఆకు జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు కడుపునొప్పి, కడుపుమంట లాంటివి ఉన్నవాళ్లు కూడా రోజు కొత్తిమీర తినడం వల్ల కడుపులో ఎలాంటి సమస్య ఉన్న పోతుంది. ఉదయాన్నే మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు కొత్తిమీర నీళ్లు తాగితే ఆ సమస్య కాస్త తగ్గుతుంది.

కొత్తిమీర తినడం వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే.. కొత్తిమీరలోని విటమిన్‌ ఏ, సీ, ఈవిటమిన్‌ ఇ కళ్లకు చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొత్తిమీర ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్‌ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,హెచ్‌డిఎల్‌ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కొత్తిమీరలో మంచి ఫైబర్‌ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్‌ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది.  కొత్తిమీరలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫంక్షన్‌ ఆర్థరైటిస్‌ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది. ఐరన్‌, విటమిన్‌ ఇ , విటమిన్‌ ఎ యొక్క పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..