
మారుతున్న జీవనశైలితో థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే సరైన ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టి.. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ ఆహారంలోకి అయోడిన్ కలిగిన ఆహారాలు, నట్స్, పెరుగు, ఆకుకూరలు, బెర్రీలు వంటివి చేర్చుకోెవాలి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపర్చేందుకు దోహదపడుతాయి. అయితే ఈ వ్యాధిగ్రస్తులు సోయా, క్యాబేజీ వంటి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వ్యాయామం, నిద్ర కూడా థైరాయిడ్ నియంత్రణకు అవసరం. మీ వైద్యుడి సలహా మేరకు ఆహార నియమాలు పాటించండి.
థైరాయిడ్‌ను నియంత్రించే ఆహారాలు ఆవే
అయోడిన్ కలిగిన ఆహారాలు: థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ అవసరం. అయోడైజ్డ్ ఉప్పు, చేపలు, గుడ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపర్చుకోవచ్చు.
నట్స్: బాదం, వాల్‌నట్స్, బ్రెజిల్ నట్స్ వంటి వాటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. వీటిలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు శరీరంలో మంటను తగ్గిస్తాయి.
పెరుగు-పాల ఉత్పత్తులు: పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, థైరాయిడ్ పనితీరుకు అవసరమైన విటమిన్ డి, కాల్షియంను కూడా అందిస్తాయి. దీని వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.
ఆకుకూరలు: ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్ల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎలా అందుతాయనేది. వాటిని తీసుకునే విధానంపై ఆదారపడి ఉంటుంది. వాటిని పచ్చిగా తీసుకోవడం కన్నా ఉడికించి తీసుకోవడం ఉత్తమం.
బెర్రీలు: స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి థైరాయిడ్ గ్రంథి కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. అలాగే థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
థైరాయిడ్ రోగస్థులు తీసుకోకూడని ఆహారాలు
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. సోయా ఉత్పత్తులు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను అధికంగా తీసుకోవడం మానుకోండి. ఇవి శరీర అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అలాగే, ప్రాసెస్ చేసిన ఆహారాలు , చక్కెర అధికంగా ఉండే ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి.
గుర్తుంచుకోవాల్సి ముఖ్యమైన విషయాలు
థైరాయిడ్ నియంత్రణలో రోజువారీ వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు మీ వైద్యుడు సూచించిన మందులు తీసుకోవడంతో పాటు ఈ ఆహార నియమాలను పాటిస్తే, మీరు మీ థైరాయిడ్ సమస్యను సులభంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.