మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడితో కూడుకున్న జీవితం, సరిపడ నీరు తీసుకోకపోవడం, ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం తగ్గడం ఇలా మలబద్ధకానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే సహజంగా మలబద్ధకం కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయని భావిస్తుంటాం. కానీ తాజా పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
మలబద్ధకం తీవ్ర ఆరోగ్య సమస్యకు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మలబద్ధకంకు త్వరగా చికిత్స అందకపోతే ప్రాణాంత వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. మల విసర్జన సరిగ్గా లేకపోతే దీర్ఘకాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కారణాలు వివరించారు.
సాధారణంగా మలబద్ధకం కారణంగా పేగులు పూర్తి స్థాయిలో శుభ్రంకావు. దీంతో పేగుల్లో క్రమంగా మలం పేరుకుపోతుంది. దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారిలో శరీరంలో వాపునకు దారి తీస్తుంది. ఇది క్రమేణ గుండెపోటుకు దారి తీస్తుందని అంటున్నారు. దీని కారణంగా ధమనులు,
అథెరోస్క్లెరోసిస్ గట్టిపడే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండె పోటుకు దారి తీసేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం సమస్య బారినపడకుండా ఉండాలంటే.. జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సరిపడ నీరు తాగడంతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. జీర్ణక్రియ సరిగ్గా ఉండడానికి అవసరమైన వ్యాయామాలను సైతం భాగం చేసుకోవాలని నిపునులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..