Coffee With Cigarettes: టీ/కాఫీ తాగుతూ సిగరేట్‌ కాల్చే అలవాటు మీకు కూడా ఉందా? ఐతే మీ గుండె ప్రమాదంలో పడ్డట్లే..

|

Sep 30, 2022 | 3:01 PM

ఉదయాన్నే వేడి వేడి టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించడం మనలో చాలా మందికి అలవాటు. నిద్రలేవంగానే కప్పు టీ/కాఫీ తాగకపోతే ఉండలేనంతగా అలవాటు పడి పోతుంటారు. దాదాపు ఓ వ్యసనంగా మన జీవితాల్లో ఇవి భాగమైపోయాయి. పరిశోధనల ప్రకారం..

Coffee With Cigarettes: టీ/కాఫీ తాగుతూ సిగరేట్‌ కాల్చే అలవాటు మీకు కూడా ఉందా? ఐతే మీ గుండె ప్రమాదంలో పడ్డట్లే..
Coffee And Cigarettes side effects
Follow us on

ఉదయాన్నే వేడి వేడి టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించడం మనలో చాలా మందికి అలవాటు. నిద్రలేవంగానే కప్పు టీ/కాఫీ తాగకపోతే ఉండలేనంతగా అలవాటు పడి పోతుంటారు. దాదాపు ఓ వ్యసనంగా మన జీవితాల్లో ఇవి భాగమైపోయాయి. పరిశోధనల ప్రకారం.. కాఫీ, టీలలోని కెఫిన్ మనల్ని వాటికి బానిసలుగా మారుస్తుంది. ఆఫీసు, ఇల్లు ఎక్కడున్నా, టైంకి చేతిలో కప్పులేకపోతే చిరాకు అనిపిస్తుంది. ఐతే చాలా మందికి కాఫీ తాగుతూ.. సిగరేట్‌ పొగ కాల్చే అలవాటు ఉంటుంది. ఈ విధంగా కాఫీ తాగుతూ, పొగ పీల్చితే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని మీకు తెలుసా? ఏయే సమస్యలు తలెత్తుతాయంటే..

డీహైడ్రేషన్

కాఫీతో పాటు పొగ తాగే అలవాటు ఉన్నవారు తరచుగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే పెదవులు, మెడపై నల్లగా ఏర్పడుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల మలబద్దకం కూడా ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

నిద్రలేమి

కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు తరచుగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంటారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. నిజానికి.. కెఫిన్ మన నిద్ర వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. ఒకసారి నిద్రలేమి సమస్య ప్రారంభమైతే.. అది చాలా కాలం పాటు వేధిస్తుంది. ప్రతి రోజూ మంచి నిద్ర పట్టాలంటే, కాఫీని తక్కువ పరిమాణంలో తీసుకోవాలనే విషయం మర్చిపోకూడదు.

జీర్ణ సమస్యలు

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీ లేదా కాఫీలోని కెఫిన్ జీర్ణ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి పెద్దపేగు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది.

అధిక రక్త పోటు

కాఫీని ఎక్కువగా తీసుకునేవారికి అధిక రక్తపోటు సమస్య మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు కణాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా గుండెపోటు సంభవిస్తుంది. అందువల్లన అధిక రక్తపోటు (బీపీ) లేదా గుండె సంబంధిత వ్యాధులున్నవారు కాఫీ తగు మోతాదులో తీసుకోవడం మర్చిపోకూడదు.