Coconut Water: చలికాలంలో కూడా కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా

|

Dec 13, 2024 | 7:05 PM

కొబ్బరి నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతే కాదు కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. కనుక చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగాలా వద్దా ఈ రోజు తెలుసుకుందాం..

Coconut Water: చలికాలంలో కూడా కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా
Coconut Water
Follow us on

కొబ్బరి నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చలికాలంలో కొబ్బరి నీరు తాగాలా వద్దా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అందుకు తగిన సమాధానం తెలుసుకుందాం.. వేసవి కాలంలో కొబ్బరి నీరు తాగడం వలన దాహార్తి తీరుతుంది. తక్షణ శక్తి ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది కనుక.. ఎటువంటి సందేహం లేకుండా కొబ్బరి నీరు తాగుతారు. అయితే చలికాలంలో కొబ్బరి నీళ్లను సేవించవచ్చా లేదా అని కొందరికి సందేహం. ఈ నేపధ్యంలో చలికాలంలో కొబ్బరి నీరు సేవిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

ఎండాకాలంలోనే కొబ్బరినీళ్లు తాగాలనే అపోహ చాలా మందికి ఉంది. కొబ్బరి నీళ్లలో శీతలీకరణ గుణాలు ఉన్నందున చలికాలంలో కొబ్బరి నీరు తాగకూడదు అని అనుకుంటారు. అయితే చలికాలంలో కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చు. చలికాలంలో కొబ్బరి నీరుని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

డీహైడ్రేషన్ సమస్య: వాస్తవానికి శీతాకాలంలో గాలి చాలా పొడిగా ఉంటుంది. దీని కారణంగా నిర్జలీకరణ అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీటిని తీసుకుంటే ఎప్పటికీ డీహైడ్రేషన్ సమస్య బారిన పడరు. చలికాలంలో రోజూ కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కనుక కొబ్బరి నీరుని ఏడాదికి 12 నెలలు తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఎలక్ట్రోలైట్ కూడా మంచి పరిమాణంలో ఉన్నాయి. కనుక ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు , మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

డ్రై స్కిన్‌కి బై బై చెప్పండి

చలికాలంలో చర్మం పొడిబారుతుందని తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు త్రాగటం వలన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చలికాలంలో జలుబు, జ్వరానికి దూరంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. కొబ్బరి నీటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కొబ్బరి నీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చలికాలంలో దీనిని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు పెరుగుతున్నరనే ఆందోళన చెందుతుంటే శీతాకాలంలో కొబ్బరి నీటిని తాగండి. ఇందులో ఉండే తక్కువ క్యాలరీలు బరువు పెరుగుతాయనే ఆందోళన నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది.

రోజూ కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల టీ, కాఫీ తాగాలన్న కోరిక ను తగ్గిస్తుంది. దీంతో కెఫిన్ తగ్గుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం కూడా మంచి మొత్తంలో ఉంటాయి. శరీరంలో సోడియం స్థాయిని బ్యాలెన్స్ చేయడంలో పొటాషియం చాలా సహాయపడుతుంది. అదనంగా రక్తపోటు నియంత్రణను కూడా మెరుగుపరుస్తుంది. చలికాలంలో కొబ్బరి నీరు శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. నిజానికి కొబ్బరి నీళ్లలో ఉండే సహజ చక్కెర, ఎలక్ట్రోలైట్ శరీరంలో శక్తిని పెంచడానికి పని చేస్తాయి.

 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)