Thalapathy Vijay: సీఎం విజయ్ అసలు నైజం ఇదేనా?.. పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ షేర్ చేసిన పోస్ట్ వైరల్!

తమిళ సినీ రంగంలో అగ్ర హీరోగా వెలిగి.. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. ఆయన నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' పార్టీ సాధించిన విజయం ఒక ఎత్తయితే.. సీఎం అయ్యాక విజయ్ ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా విజయ్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్.. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Thalapathy Vijay: సీఎం విజయ్ అసలు నైజం ఇదేనా?.. పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ షేర్ చేసిన పోస్ట్ వైరల్!
Tamil Nadu Chief Minister Vijay

Updated on: May 22, 2026 | 8:25 PM

సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా నిజ జీవితంలోనూ విజయ్ ఎంతో నిరాడంబరంగా, పద్ధతిగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా విజయ్ హెయిర్ స్టైలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఒక ‘ట్రూ జెంటిల్‌మన్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ తెర వెనుక ఎంత ఓపికగా ఉంటారు, సామాన్యుల పట్ల ఆయనకున్న గౌరవం ఏంటో హెయిర్ స్టైలిస్ట్ మాటల్లోనే ఇప్పుడు చూద్దాం.

హెయిర్ స్టైలిస్ట్ పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇవే:

అద్భుతమైన ఓపిక: “సీఎం విజయ్ గారికి ఓపిక చాలా ఎక్కువ. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా అందరితోనూ చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటారు. చివరకు నేను ఆయనకు హెయిర్ స్టైలింగ్ లేదా మేకప్ చేస్తున్న సమయంలోనూ ఎంతో సహనంతో కూర్చుంటారు” అని హెయిర్ స్టైలిస్ట్ పేర్కొన్నారు.

ప్రజలపై ఎనలేని ప్రేమ, కేరింగ్: విజయ్ కేవలం ఒక లీడర్‌గానే కాకుండా.. తన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి బాగుబాగులను స్వయంగా అడిగి తెలుసుకుంటారని ఆయన చెప్పారు. ప్రజల అవసరాలు, వారి సమస్యల పట్ల విజయ్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, కేరింగ్ ఉంటుందని వెల్లడించారు.

మారిన బాధ్యత – మారని వ్యక్తిత్వం: సాధారణంగా ఒక నటుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పుడు ప్రవర్తనలో మార్పులు రావడం సహజం. కానీ విజయ్ మాత్రం గతంలో ఎలా ఉన్నారో.. సీఎం అయ్యాక కూడా తన స్టాఫ్ సహాయకులతో అంతే గౌరవంగా, మర్యాదగా ప్రవర్తిస్తున్నారని హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం తమిళనాడులో విజయ్ నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణ పరిపాలనాపరమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆయన నిజ జీవిత క్యారెక్టర్ గురించి హెయిర్ స్టైలిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు విజయ్ అభిమానులను, అలాగే తమిళ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Follow Us