Children Health Care: మీ పిల్లలు ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారా? ఈ 3 పాటిస్తే పిల్లలు ఎప్పటికీ ఫిట్‌..

Obesity in Kids: చిన్నప్పటి నుంచే పిల్లల జీవనశైలి సరిగా లేకపోతే.. ఊబకాయం బారిన పడుతారు. ఫలితంగా త్వరగా లావు అవుతారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఇక అధిక బరువు కారణంగా సోమరితనం, బద్దకం పెరిగిపోతుంది. ఈ పరిస్థితి పిల్లలను మరింత కుంగదీస్తుంది. పిల్లలకు ప్రాణాంతకం కూడా కావొచ్చు. అందుకే.. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి..

Children Health Care: మీ పిల్లలు ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారా? ఈ 3 పాటిస్తే పిల్లలు ఎప్పటికీ ఫిట్‌..
Kids Weight Gain

Updated on: Aug 27, 2023 | 6:03 PM

Obesity in Kids: చిన్నప్పటి నుంచే పిల్లల జీవనశైలి సరిగా లేకపోతే.. ఊబకాయం బారిన పడుతారు. ఫలితంగా త్వరగా లావు అవుతారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఇక అధిక బరువు కారణంగా సోమరితనం, బద్దకం పెరిగిపోతుంది. ఈ పరిస్థితి పిల్లలను మరింత కుంగదీస్తుంది. పిల్లలకు ప్రాణాంతకం కూడా కావొచ్చు. అందుకే.. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పేరెంట్ తమ పిల్లలు ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మూడు విషయాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మూడు అంశాలేంటి? అవి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రయోజనం చూపుతుంది? అనే కీలక వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆహారంపై నియంత్రణ..

మీ బిడ్డ మునుపటిలా చురుకుగా లేరని గుర్తిస్తే.. వెంటనే వారిపై ఓ కన్నేసి ఉంచండి. వారి బరువు పెరుగుదలకు ఇది ఒక సూచికగా చెబుతున్నారు నిపుణులు. అందుకే, వెంటనే పిల్లల ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు, పాల ఉత్పత్తులను పిల్లలకు దూరంగా ఉంచాలి. ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్, ఫైబర్ ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినేలా వారిని ప్రేరేపించాలి.

శారీరక శ్రమను ప్రోత్సహించండి..

పిల్లలు కొందరు బద్దకంగా, నీరసంగా ఉంటారు. అలాంటి సందర్భంలో వారిని శారీరక శ్రమకు ప్రోత్సహించాలి. వ్యాయామం, చిన్నపాటి రన్నింగ్ పై అవగాహన కల్పించాలి. ఇంట్లో కూర్చుని తింటూ ఉంటే బరువు వేగంగా పెరుగుతుంది. అందుకే పిల్లలు తమ సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామం చేయడం, ఆడటం, నడవడం చేస్తుంటే పిల్లలు ఆరోగ్యంగా మారుతారు. మళ్లీ యాక్టీవ్‌గా మారుతారు.

జీవనశైలిని మెరుగుపరచండి..

చాలా మంది పిల్లలు టీవీ చూస్తూ ఆహారం తింటారు. టేస్టీ ఫుడ్ పేరుతో అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటూ మొబైల్, టీవీలతో బిజీ బిజీగా గడిపేస్తారు. అయితే, ఈ అలవాటు కూడా వారి బరువు పెరగడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. టీవీ చూస్తూ పిల్లలు ఎక్కువ తినేస్తారట. దాని కారణంగా వారు బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సలహా కూడా ఇస్తున్నారు. తినే సమయంలో డైనింగ్ టేబుల్ వద్దకు రావాలని, ఆహారంపై దృష్టి పెట్టాలని పిల్లలకు సూచించాలి. తినే ఆహారం విషయంలో వారికి అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఇక రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, తెల్లవారుజాము వరకు నిద్రపోవడం వంటి అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను చూపించి, వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..