Chia Seeds: చిన్నగా ఉన్నాయని చులకనగా చూడొద్దు.. దానితో కలిపి తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే!

Weight loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా? బరువు తగ్గడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. మీరు ఇప్పుడు జిమ్‌కు వెళ్లకుండానే, డైట్‌ పాటించకుండానే ఈ ఒక్క చిట్కాను పాటించి ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Chia Seeds: చిన్నగా ఉన్నాయని చులకనగా చూడొద్దు.. దానితో కలిపి తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే!
Chia Seeds Benefits

Updated on: Dec 30, 2025 | 4:08 PM

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. బరువును తగ్గించుకొని స్లిమ్‌గా కనిపించేందుకు చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. కొందరు జిమ్‌కు వెళ్తూ డైట్‌ల ఫాలో అవుతుంటే. మరికొందరు మందులు వాడి బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు. కానీ మన వంటింట్లో లభించే రెండు వస్తువులతో మన శరీరంలో పేరుకు పోయిన కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును మన ఇంట్లో దొరికే పెరుగు, చియా గింజలతో శరీరంలో పేరుకు పోయిన కొవ్వును ఈజీగా కరిగించవ్చు.

చియా గింజలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా కష్టపడి జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తారు. కానీ ప్రతిరోజూ ఒక చెంచా చియా గింజలను పెరుగులో కలిపి తీసుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చని చాలా మందికి తెలియదు. అవును పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులో కాల్షియం, ప్రోటీన్ జీర్ణక్రియను జీవక్రియను పెంచుతుంది. అలాగే చియా గింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి ఇవి కొవ్వును ఈజీగా కరిగిస్తాయి.

బరువును ఎలా తగ్గిస్తుంది.

సాధారణంగా బరువు తగ్గడానికి చియా గింజలను నీటిలో కలిపి తీసుకుంటారు. నిజానికి, పెరుగు ఒక ప్రోబయోటిక్ పదార్థం, చియా గింజలు ఒక ప్రీబయోటిక్ కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో గట్-ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది ఎక్కవ సమయం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఆకలిని తగ్గిస్తుంది. మీరు అనవసరంగా తనడాన్ని తగ్గిస్తుంది. అందువల్ల ఇది కేలరీలను నియంత్రణలో ఉంచి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.