Suji Rava: ఈ సమస్యలున్నవారు సుజీ రవ్వకి దూరంగా ఉండండి.. లేదంటే బండి షెడ్డుకే..

టిఫిన్ త్వరగా తయారు చేయాలంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఉప్మా. దీనిని సుజీ రవ్వతో చేస్తారు. ఈ సుజీ రవ్వని సెమోలినా అని , బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రవ్వ దురుమ్ గోధుమలతో తయారు చేయబడుతుంది. అయితే ఈ సుజీ రవ్వతో ఒక్క ఉప్మా మాత్రమే కాదు.. హల్వా నుంచి రకరాకాల రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే రోజూ సుజీ రవ్వతో చేసిన వంటకాలు తింటే ఏమి జరుగుతుందో తెలుసా..

Suji Rava: ఈ సమస్యలున్నవారు సుజీ రవ్వకి దూరంగా ఉండండి.. లేదంటే బండి షెడ్డుకే..
Semolina Food

Updated on: Oct 10, 2025 | 1:32 PM

సెమోలినా లేదా సుజీ రవ్వ తప్పనిసరిగా ప్రతి భారతీయుల ఇళ్ళల్లో ఉంటుంది. దీనిని ఉప్మా, హల్వా, చీలా, ధోక్లా, దోస, టోస్ట్ అంటూ రకరకాల వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రవ్వతో రుచికరమైన వంటలను తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. అందుకనే అల్పాహారానికి బెస్ట్ ఎంపిక ఈ రవ్వ. ఎందుకంటే ఇది త్వరగా ఉడుకుతుంది. జీర్ణం కావడం సులభం. దీనిలోని కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా.. దీనితో చేసిన ఆహారపదార్ధాలు తక్షణ శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. అందుకనే సోషల్ మీడియాలో వంటల తయారీ తెరచి చూస్తే.. తప్పనిసరిగా రకరకాల సుజీ రవ్వతో చేసిన టిఫిన్స్ కనిపిస్తాయి. అయితే ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా సుజీ రవ్వని తినడం వలన కలిగే ప్రభావాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయంపై నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకుందాం.

సెమోలినా లేదా సుజీ రవ్వ కూడా గోధుమల నుంచే తయారవుతుంది.. అయితే ఇది ప్రత్యేకంగా దురుమ్ గోధుమల నుంచి తయారు చేయబడుతుంది. ఇది చాలా గట్టి ధాన్యం కలిగిన గోధుమ రకం. ముందుగా, గోధుమలను శుభ్రం చేసి.. తేమను సమతుల్యం చేయడానికి నానబెడతారు. తరువాత.. గోధుమ పొట్టును పూర్తిగా తొలగిస్తారు. తరువాత.. ఈ గోధుమలను పిండి చేయడానికి బదులుగా సన్న సన్నని రవ్వగా చేస్తారు. ఇలా మృదువైన గోధుమ రవ్వ తయారు అవుతుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ అల్పాహారంగా సుజీ రవ్వతో చేసిన వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

సెమోలినాలో ఉండే పోషకాలు ఏమిటి?
హెల్త్‌లైన్ ప్రకారం 56 గ్రాముల సెమోలినాలో 198 కేలరీలు, 40 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 7 గ్రాముల ప్రోటీన్, రోజువారీ ఫైబర్ విలువలో 7 శాతం, థయామిన్ 41 శాతం, ఫోలేట్ 36 శాతం, రిబోఫ్లేవిన్ 29 శాతం, మెగ్నీషియం 8 శాతం, ఐరన్ 13 శాతం ఉంటాయి. అయితే ఈ రవ్వని వండిన తర్వాత ఈ పోషకాలు తగ్గవచ్చు.

ఇవి కూడా చదవండి

అల్పాహారంగా సుజీ రవ్వతో చేసిన పదార్ధాలు
ధర్మశిల నారాయణ హాస్పిటల్‌లో సీనియర్ డైటీషియన్ అయిన పాయల్ మాట్లాడుతూ.. ఇడ్లీ, చీలా లేదా ఉప్మా వంటి సెమోలినా ఆధారిత అల్పాహార పదార్థాలను ప్రతి రోజూ తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని చెప్పారు. కనుక దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమం.

ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
సుజీ రవ్వ తేలికగా ఉంటుందని. కనుక ఇది కడుపు బరువుగా అనిపించదని, సులభంగా జీర్ణమవుతుందని, ఇది మంచి అల్పాహార ఎంపికని నిపుణులు అంటున్నారు. ఇందులోని అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ శక్తిని అందిస్తుంది. సెమోలినాలో పెరుగు, పప్పులు, కూరగాయలను కలిపి ఆహారం తయారు చేసుకుంటే.. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు వంటి అదనపు పోషకాలను పొందవచ్చు.

వీరికి ఆరోగ్యానికి హానికరం
సెమోలినా జీర్ణం కావడానికి సులభం.. కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనిని ప్రతిరోజూ అల్పాహారంగా తినడం వల్ల శరీరంలో పోషక అసమతుల్యత ఏర్పడుతుందని డైటీషియన్ పాయల్ అంటున్నారు, ఎందుకంటే సెమోలినాలో అధిక మొత్తంలో ఫైబర్, ఐరన్ లేదా విటమిన్లు ఉండవు. సుజీ రవ్వను ఎక్కువ కాలం పాటు నిరంతరం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి.

ఈ విధంగా తినడం వల్ల మీ బరువు పెరుగుతారు
సుజీ రవ్వలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. దీనితో ఆహార పదార్ధాలను తయారుచేసేటప్పుడు ఎక్కువ నూనె, నెయ్యి లేదా వెన్న ఉపయోగిస్తే, అది మరింత బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ తక్కువ నెయ్యి లేదా నూనెతో సుజీ రవ్వతో ఆహారాన్ని తయారు చేయండి . అనేకాదు తక్కువ మొత్తంలోనే దీనితో చేసిన ఆహారాన్ని తినండి.

గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నావారు దూరంగా ఉండండి
గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులకు సుజీ రవ్వతో చేసిన ఆహారాన్ని తిన్న తర్వాత కడుపు నొప్పి, కడుపు బరువును అనుభవించవచ్చు. గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని తిన్న తర్వాత కూడా కడుపు నొప్పి అనిపిస్తే.. సుజీ రవ్వతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. గ్లూటెన్ అనేది పిండిని సరళంగా చేయడానికి జిగురుగా పనిచేసే పదార్థం.

సుజీ రవ్వని ఎన్ని సార్లు తినాలంటే
ఈ రవ్వని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, లోపాలను పరిగణనలోకి తీసుకుంటే.. వారానికి రెండు నుంచి మూడు సార్లు అల్పాహారంలో సుజీ రవ్వని చేర్చుకోవడం ఉత్తమం. ఇతర రోజుల్లో ఓట్స్, పెసరట్టు, పోహా, మొలకలు, ఇడ్లీ వంటి ఆరోగ్యకరమైన అల్పహారాలను ఎంపిక చేసుకుని తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వలన శరీరానికి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అందిస్తున్నట్లు అవుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us