Side Effects with Tea: ఎక్కువ సార్లు టీ తాగుతున్నారా..? అయితే ఈ ప్రమాదాలలో పడినట్లే..

మనలో చాలా మందికి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు భోజనం కంటే ఎక్కువగా టీ, కాఫీలనే ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. వీరికి కాలంతో, సమయంతో సంబంధం ఉండదు. తమలోని..

Side Effects with Tea: ఎక్కువ సార్లు టీ తాగుతున్నారా..? అయితే ఈ ప్రమాదాలలో పడినట్లే..
Side Effects With Tea

Updated on: Dec 21, 2022 | 12:56 PM

ప్రస్తుత కాలంలో మనం వింత వింత ఆహారపు అలవాట్లను, జీవన విధానాలను అవలంభిస్తూ కొత్త కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అలాంటి ఆహారపు అలవాట్లలో టీ లేదా కాఫీ తాగడం కూడా ఒకటి. మనలో చాలా మందికి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు భోజనం కంటే ఎక్కువగా టీ, కాఫీలనే ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. వీరికి కాలంతో, సమయంతో సంబంధం ఉండదు. తమలోని బద్దకాన్ని, టెన్షన్స్‌ను తరిమికొట్టేందుకు టీ, కాఫీలనే ఆయుధాలుగా ఉపయోగిస్తుంటారు అలాంటివారు. అయితే టీ ఎక్కువగా తాగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని మీకు తెలుసా..?  ముఖ్యంగా ఏదైనా తిన్న తర్వాత టీ తాగడం మన ఆరోగ్యానికి హానీ చేస్తుందనే విషయాన్ని విన్నారా..? రోజుకు రెండు కప్పుల టీ తాగడం వల్ల మన ఆరోగ్యానకిి ఎటువంటి నష్టం లేదు.

అయితే టీ లేదా కాఫీ తాగడానికి కూడా సమయం, సందర్భాలను కూడా చూసుకోవాలి. ఉదయం వేళ అల్పాహారంతో పాటుగా చాలా మంది టీ తాగుతుంటారు. అలాగే సాయంత్రం కూడా స్నాక్స్‌తో టీని తాగుతారు. అలా టీ తాగడం వల్ల  మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ పగటి వేళ తిన్న తర్వాత లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అతిగా టీ తాగడం వల్ల కూడా తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. ఆహారం తిన్న తర్వాత టీ తాగితే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, పొట్ట సమస్యలు కూడా వస్తాయి. భోజనానికి ముందు, తర్వాత టీ తాగడం మంచిది కాదు. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.

ఇంకా టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రేగుల కదలికపై ప్రభావం చూపుతుంది.అంతేకాక కడుపులోని ప్రేగులలో ఎంజైమ్‌ల ఉత్పత్తి ఆగిపోవడానికి కారణమై మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది. సరిగ్గా తిన్నప్పటికీ కడుపులో మలబద్ధకం సమస్య ఉందని కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. టీ ఎక్కువగా తాగడమే దీనికి ప్రధాన కారణం. అధికంగా టీ తాగడం వల్ల కార్టిసాల్ లేదా స్టెరాయిడ్ హార్మోన్ స్థాయి పెరిగి, ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. రాత్రిపూట నిద్రలేమితో బాధపడడానికి కూడా టీ ఎక్కువగా తాగడమే కారణం. కాబట్టి మరీ తలనొప్పిగా ఉన్నప్పుడు లేదా టెన్షన్స్‌ నుంచి ఉపశమనం కోసం మాత్రమే అది కూడా రోజుకు రెండు, మూడు సార్లే టీ లేదా కాఫీలను తాగండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి