వెల్లుల్లితో కరోనాకు చెక్..? అన్ని లక్షణాలకు ఇందులోనే మందు..! మీరూ ట్రై చేయండి..

|

May 07, 2021 | 7:50 PM

Check Corona With Garlic : పెరుగుతున్న కరోనా ముప్పు దృష్ట్యా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం.

వెల్లుల్లితో కరోనాకు చెక్..? అన్ని లక్షణాలకు ఇందులోనే మందు..! మీరూ ట్రై చేయండి..
Garlic
Follow us on

Check Corona With Garlic : పెరుగుతున్న కరోనా ముప్పు దృష్ట్యా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. కరోనా వ్యాధిని నివారించడానికి ప్రజలు అనేక పద్దతులను ఆశ్రయిస్తున్నారు. నిపుణులు, వైద్యులు కూడా కరోనా నుంచి బయటపడాలంటే గృహ వస్తువులను వాడుకోవాలని సలహా ఇస్తున్నారు. వాటిలో ముఖ్యమైంది వెల్లుల్లి. ఇది అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది.

1. దగ్గును నయం చేస్తుంది..
మీకు దగ్గు ఉంటే మీరు వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. ఇది దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఒక గ్లాసు దానిమ్మ రసానికి కొన్ని చుక్కల వెల్లుల్లి రసం జోడించండి. దీన్ని బాగా కలపండి ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. ఇది శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది.

2. గొంతు నొప్పి నయమవుతుంది..
కరోనా కాలంలో చాలా మందికి గొంతు నొప్పి ఉంటుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే ఒక గ్లాసు వేడి నీటిలో కొన్ని చుక్కల వెల్లుల్లి రసం కలపండి. ఈ నీటితో గార్లింగ్ చేయండి ఉపశమనం లభిస్తుంది.

3. ఉబ్బసాన్ని నివారిస్తుంది..
మీకు ఉబ్బసం ఉంటే మీరు వెల్లుల్లి రసం ఉపయోగించాలి. ఇది మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు వెల్లుల్లి కూడా తినవచ్చు. ఉబ్బసం రోగులకు ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసం కలిపి తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

4. మొటిమల బాధను తగ్గిస్తుంది..
మీరు మొటిమలతో బాధపడుతుంటే వెల్లుల్లి రసం వాడండి. ఇందుకోసం 5 నుంచి 6 టీస్పూన్ల వెల్లుల్లి రసం తీసుకొని దూది సహాయంతో ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.. మీకు ఉపశమనం లభిస్తుంది.

5. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..
వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె సమస్యలను కూడా అధిగమించగలదు.

6. జుట్టు సమస్యలు..
మీ జుట్టు రాలిపోతుంటే, చుండ్రు సమస్య ఉంటే మీరు వెల్లుల్లి రసాన్ని ఉపయోగించవచ్చు. 2 టీస్పూన్ల వెల్లుల్లి రసం తీసుకోండి కొన్ని చుక్కల ఆవ నూనె వేసి మీ జుట్టు మూలాలపై రాయండి. ఇది జుట్టు రాలడం చుండ్రు నుంచి కాపాడుతుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా జట్టు ఎంపిక.. ఆ ఇద్దరికీ దక్కని చోటు..

India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం