AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా..? మెకానిక్‌ ఖర్చు లేకుండానే స్పీడ్ పెంచే సూపర్‌ ట్రిక్స్ ఇవే!

ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో ఫ్యాన్ వేగం తగ్గితే అస్సలు భరించలేం. కొన్నేళ్ల వాడకం తర్వాత చాలా ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు స్లో అయిపోతుంటాయి. ఐదో నంబర్‌లో పెట్టినా కూడా ఒకటో నంబర్ వేగంతో తిరుగుతూ చుక్కలు చూపిస్తాయి. దీనికోసం వెంటనే ఎలక్ట్రీషియన్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లోనే మీ ఫ్యాన్ వేగాన్ని మునుపటిలా పెంచుకోవచ్చు. ఆ సులువైన సూపర్ ట్రిక్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా..? మెకానిక్‌ ఖర్చు లేకుండానే స్పీడ్ పెంచే సూపర్‌ ట్రిక్స్ ఇవే!
Ceiling Fan Running Slow
Jyothi Gadda
|

Updated on: May 21, 2026 | 4:43 PM

Share

వేసవి కాలంలో ప్రతి ఇంట్లో ఫ్యాన్ అత్యంత అవసరమైన వస్తువులలో ఒకటి. కానీ, కొన్నిసార్లు పాత ఫ్యాన్ మునుపటిలా బలమైన గాలిని ఇవ్వదు. ఫ్యాన్ నెమ్మదిగా తిరగడం, శబ్దం చేయడం లేదా తక్కువ గాలిని ఇవ్వడం చూస్తుంటాం. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గితే ఉక్కపోతతో ఇల్లు నరకంలా మారుతుంది. అటువంటి పరిస్థితులలో చాలా మంది వెంటనే కొత్త ఫ్యాన్ కొనాలని ఆలోచించడం మొదలుపెడతారు. అయితే, ప్రతిసారీ కొత్త ఫ్యాన్ కొనవలసిన అవసరం లేదు. మెకానిక్‌ ని పిలిచి డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు.. అయితే, ఫ్యాన్ స్లో అవ్వడానికి టెక్నికల్ సమస్యలే కాదు, సాధారణ కారణాలు కూడా ఉండవచ్చు. ఫ్యాన్ వేగాన్ని పెంచడానికి 6 సులువైన మార్గాలు ఉన్నాయి. మీ సీలింగ్ ఫ్యాన్ కూడా నెమ్మదిగా తిరుగుతుంటే, కొత్తది కొనే ముందు ఈ పని చేయండి.

రెగ్యులేటర్‌ను చెక్‌ చేయండి (Check the Regulator): కొన్నిసార్లు ఫ్యాన్‌లో ఎలాంటి లోపం ఉండదు. కానీ, దాన్ని నియంత్రించే రెగ్యులేటర్ పాడవడం వల్ల వోల్టేజ్ సరిగ్గా అందక ఫ్యాన్ స్లో అవుతుంది. అవసరమైతే కొత్త మోడ్యులర్ రెగ్యులేటర్‌ను మార్చడం మంచిది.

బ్లేడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి (Clean the Blades): ఫ్యాన్ రెక్కలపై దుమ్ము, ధూళి విపరీతంగా పేరుకుపోతే బ్లేడ్ల బరువు పెరుగుతుంది. ఇది మోటార్‌పై అదనపు భారాన్ని వేసి వేగాన్ని, గాలి ప్రసరణను తగ్గిస్తుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక పిల్లోకవర్ సహాయంతో దుమ్ము కింద పడకుండా రెక్కలను శుభ్రం చేయాలి.

ఇవి కూడా చదవండి

వంగిన బ్లేడ్లను సరిచేయండి (Balance the Blades): ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఊగుతున్నట్లు అనిపిస్తే బ్లేడ్ల అలైన్‌మెంట్ దెబ్బతిన్నట్లు అర్థం. లూజుగా ఉన్న స్క్రూలను బిగించడం లేదా వంగిన రెక్కలను స్ట్రెయిట్ చేయడం ద్వారా బ్యాలెన్స్ రీస్టోర్ అయి స్పీడ్ పెరుగుతుంది.

ఆయిలింగ్ లేదా లూబ్రికేషన్ (Lubricate the Fan): ఫ్యాన్ మోటార్‌లోని బాల్ బేరింగ్స్‌లో దుమ్ము చేరినప్పుడు అవి తిరగడానికి ఇబ్బంది పడతాయి. ఫలితంగా ఫ్యాన్ తిరిగేటప్పుడు కిర్రుమనే శబ్దం వస్తుంది. స్పీడ్ తగ్గుతుంది. ఫ్యాన్ ఆయిల్ పోర్ట్స్‌లో లేదా బేరింగ్స్‌పై కొన్ని చుక్కల మెషిన్ ఆయిల్ వేస్తే ఫ్రిక్షన్ (ఘర్షణ) తగ్గి ఫ్యాన్ ఫాస్ట్‌గా తిరుగుతుంది.

కెపాసిటర్ మార్చండి (Replace the Capacitor) – అత్యంత ముఖ్యం: ఫ్యాన్ స్లో అవ్వడానికి 90 శాతం కేసుల్లో కారణం కెపాసిటర్ బలహీనపడటమే. ఇది ఫ్యాన్ స్టార్ట్ అవ్వడానికి, తిరగడానికి అవసరమైన పవర్‌ను స్టోర్ చేస్తుంది. మార్కెట్లో కేవలం 30 నుండి 50 రూపాయలకే దొరికే కొత్త కెపాసిటర్‌ను (సాధారణంగా 2.5 mfd) పాతదాని స్థానంలో రీప్లేస్ చేస్తే ఫ్యాన్ మళ్లీ సరికొత్త ఫ్యాన్‌లా తిరుగుతుంది.

వైరింగ్, వోల్టేజ్ (Check Wiring & Voltage): ఇంట్లో వోల్టేజ్ తక్కువగా ఉన్నా లేదా ఫ్యాన్ కనెక్షన్ వైర్లు లూజుగా ఉన్నా వేగం తగ్గుతుంది. కనెక్షన్లను సరిచూసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ ఆరు పద్ధతులను ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తే, మీ ఇంట్లోని స్లో ఫ్యాన్ సమస్య చిటికెలో దూరమైపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. రూ.2 లక్షలు దాటతాయా..?
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. రూ.2 లక్షలు దాటతాయా..?