
ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో జపాన్ ప్రజల రూటే సపరేటు. దీర్ఘాయువుతోపాటు వృద్ధాప్యంలోనూ ఫిట్ ఫిజిక్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటారు. ఇందుకు ఆహారం, వ్యాయామం కీలకమైనప్పటికీ జపాన్ ప్రజలు అనుసరించే రోజువారీ అలవాట్లు వారిని నిత్యయవ్వనంగా మారుస్తున్నాయి. ఇవే వారి శరీరాన్ని యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న క్యాన్సర్ హీలర్ సెంటర్‌లో క్యాన్సర్ నిపుణుడు MD డాక్టర్ తరంగ్ కృష్ణ అంటున్నారు. ఎవరైనా ఆరోగ్యంగా, శక్తివంతంగా, ఫిట్‌గా ఉండటానికి ఈ అలవాట్లు ఎలా సహాయపడతాయో ఆయన వివరించారు.
జపానీస్ ఆరోగ్య రహస్యం ‘హర హచి బు’ అనే అలవాటు అని డాక్టర్ తరంగ్ చెబుతున్నారు. దీని అర్థం మీరు ఎంత తింటున్నారు. అంటే ఆకలి దాదాపు 80% నిండిన తర్వాత ఆపాలి. బదులుగా పూర్తిగా కడుపు నిండినట్లు అస్సలు తినకూడదు. ఎందుకంటే కడుపుకు అంత ఆహారం అవసరం లేదని ఆయన వివరించారు. ఈ సూత్రాన్ని జపాన్‌లో పిల్లల నుంచి 90 ఏళ్ల వయస్సు గల వృద్ధుల వరకు అందరూ అనుసరిస్తారు. ఆ అలవాటును మొత్తం సమాజం, నగరం, పట్టణం అనుసరిస్తే అది దీర్ఘాయువుతోపాటు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే జీవనశైలి అలవాటుగా మారుతుందన్నారు.
ఇష్టమైన ఆహారం ఒక్కోసారి పరిమితికి మించి తినేస్తుంటారు. ఇలా అనుకోకుండా ఎక్కువ తింటే ఏమి జరుగుతుంది? అని ఎవరో అడిగారు. భోజనం 80% వద్ద ఆపడం ముఖ్య ఉద్దేశ్యం.. కడుపులోని మీ జీర్ణ రసాలు సరిగ్గా పనిచేయడానికి అది సరిపోతుంది. 80% నిండిన తర్వాత ఆపడం ద్వారా మీకు ఎంత ఆహారం సరిపోతుందో తెలుస్తుంది. అలాగే ఇంకా కొంచెం ఆకలితో ఉన్నట్లు మీకు అనిపించినా నిజానికి మీ శరీరానికి తగినంతగా ఆహారం తిన్నట్లే లెక్క. ‘హర హచి బు’ సూత్రం అనుసరించడం ద్వారా బరువు నియంత్రణ కూడా చాలా సులువు. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. రోజంతా మరింత శక్తివంతంగా ఉండగలరు అని డాక్టర్ కృష్ణ వివరించారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.