Chicken in Fever: జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..

|

Nov 23, 2024 | 4:30 PM

జ్వరంతో ఉన్నప్పుడు చాలా వరకు నాన్ వెజ్ వంటలకు, త్వరగా జీర్ణం కాని ఆహారాలకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలోనే చికెన్ తినాలని ఉన్నా కూడా తినరు. ఇంట్లో వాళ్లు కూడా అందుకు ఒప్పుకోరు. కానీ ఇంట్లో చేసిన చికెన్‌ని హ్యాపీగా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

Chicken in Fever: జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
Chicken In Fever
Follow us on

నాన్ వెజ్ వంటకాల్లో చికెన్ ప్రధానం. చికెన్‌తో కొన్ని వందల రెపిసీలు తయారు చేయవచ్చు. స్నాక్స్‌లో కూడా వందల రకాలు తయారు చేయవచ్చు. ఎలా చేసినా చికెన్ టేస్ట్ వేరే లేవెల్‌లో ఉంటుంది. చికెన్ ప్రియులు ఎక్కువగా స్నాక్స్, వేపుళ్లు తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. అందులోనూ నాటుకోడి అంటే వేరేగా చెప్పాల్సిన పని లేదు. జలుబు తగ్గేందుకు చాలా మంది చికెన్ తింటూ ఉంటారు. అలాగే జ్వరంతో ఉన్నప్పుడు కూడా కొంత మంది చికెన్ తింటే తగ్గిపోతుందని అంటారు. దీంతో స్పైసీగా ఉండే ఫుడ్స్ వండుకుని తింటూ ఉంటారు. మరికొంత మంది జ్వరం వస్తే అస్సలు నాన్ వెజ్ జోలికే పోరు. కేవలం మితమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇది ఎంత వరకు కరెక్ట్? జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది? అనే సందేహంపై ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు:

జ్వరంలో ఉన్నప్పుడు మీకు చికెన్ తినాలి అనిపించినప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా చికెన్ తినవచ్చు. జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తింటే.. మీ రోగ నిరోధక శక్తి అనేది బలపడుతుంది. చికెన్‌లో ఎన్నో రకాల పోషఖాలు ఉంటాయి. ఇవి జ్వరం ద్వారా వచ్చే నీరసాన్ని, అలసటను దూరం చేస్తాయి. మళ్లీ ఎనర్టిటిక్‌గా అయ్యేలా చేస్తాయి. కొంత మందికి జ్వరంలో ఉన్నప్పుడు స్పైసీగా ఉండే ఆహారాలు తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఇంట్లోనే చేసిన చికెన్ బిర్యానీ లేదా చికెన్ ఐటెమ్స్ హ్యాపీగా తినవచ్చు.

ఇలా తినాలి:

జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినమన్నారని ఎలా పడితే అలా తినకూడదు. ఇంట్లో చేసిన చికెన్ మాత్రమే తినాలి. ఎందుకంటే బయట ఎలా వండుతారో, ఇంకా వాటిల్లో ఏం కలుపుతారో తెలీదు. కాబట్టి.. చికెన్‌ని కాస్త ప్రత్యేకంగా తినాలి. కారాలు, మసాలాలు తగ్గించాలి. చికెన్‌ని బాగా ఉడికించి తినాలి. వేపుళ్లు వంటివి తినకూడదు. ఉడికించి వేపుడు తీసుకున్నా మంచిదే. కానీ చికెన్‌ని మాత్రం బాగా ఉడికించే తినాలి. అలా తింటే త్వరగా జీర్ణం అవుతుంది. ఎలాంటి సమస్యలు రావు.

ఇవి కూడా చదవండి

ఈ సమస్యలు రావచ్చు:

జ్వరంలో ఉన్నప్పుడు చికెన్‌ని ఎందుకు తినకూడదు అంటారంటే.. జీర్ణ సమస్యలు రావచ్చు. చికెన్ అనేది మందమైన ఆహారం. ఇది అరిగేందుకు చాలా సమయం పడుతుంది. జ్వరంలో ఉన్నప్పుడు జీర్ణ క్రియ చాలా నెమ్మదిగా పని చేస్తుంది. కాబట్టి చూసి తినాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.